Andhra Pradesh

News June 10, 2024

VZM: బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకున్నారు

image

ఓ వ్యక్తికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్.కోట మం. వెంకటరమణ పేటకు చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్‌పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో అతనిపై దాడిచేశారు.

News June 10, 2024

ఆత్మకూరులో వైసీపీ పైలాన్ ధ్వంసం

image

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఇటీవల ఎంపీ విజయ సాయిరెడ్డి వైసీపీ పైలాన్‌ను ప్రారంభించారు. ఆ పైలాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే ఆత్మకూరులో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ధ్వంసం చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.

News June 10, 2024

జేఈఈలో అనంత కుర్రాళ్ల ప్రతిభ

image

JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో అనంత జిల్లా కుర్రాళ్లు మెరిశారు. అనంతకు చెందిన కుశాల్‌ కుమార్‌ 5వ ర్యాంకు, సాయి తేజేశ్‌ 54, సతీశ్‌ కుమార్‌రెడ్డి 175, సాయిగౌతమ్‌ 204, శశికిరణ్‌ 982వ ర్యాంకు సాధించారు. బీ.సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు బిడ్డ సతీశ్‌రెడ్డి, ఎన్పీకుంటకు చెందిన సాయి దివ్యతేజరెడ్డి 175వ ర్యాంకులు సాధించారు. గాండ్లపెంట మండలం తాళ్లకాల్వకు చెందిన ముజమ్మిల్‌ 823 ర్యాంకు సాధించాడు.

News June 10, 2024

44 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితుల కలయిక

image

సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980వ సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు 44 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువుకున్న సమయంలో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు.

News June 10, 2024

రాయచోటి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సంబేపల్లె మండల పరిధిలోని మోటకట్ల విద్యుత్తు ఉప కేంద్రం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాయచోటి పట్టణానికి చెందిన షేక్ బాజ్జీ (39) కలకడ వైపు నుంచి రాయచోటికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, పాఠశాల బస్సు అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాజ్జీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 10, 2024

విశాఖ: ఈనెల 15 నుంచి చేపల వేటకు సన్నాహాలు

image

సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ముగుస్తున్న నేపాథ్యంలో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి వేటకు మత్స్యకారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తూర్పు తీరంలో విశాఖ చేపల రేవు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ 700 మరపడవలు, మరో వెయ్యి వరకు ఇంజిన్ పడవలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమపై ప్రత్యక్షంగా 15,000 మంది పరోక్షంగా 10వేల మంది ఆధారపడి ఉన్నారు. వేట ప్రారంభించే ముందు ఈనెల 11న గంగాదేవి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

News June 10, 2024

అదనపుకట్నం కోసం వేధింపులు.. భార్య ఫిర్యాదు

image

బాపట్లలో అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు వేధిస్తున్నారని వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై బాపట్ల గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అవినాష్ రతన్‌తో వాసంతికి 2022లో వివాహమైంది. వివాహ సమయంలో రూ. 22 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కొంత కాలానికి అదనంగా కట్నం తీసుకురావాలని తనను భర్త అవినాష్ రతన్, అత్త, మామ వేధిస్తున్నారని వివాహిత ఫిర్యాదు చేసింది.

News June 10, 2024

కర్నూలు: నీటి కుంటలో పడి బాలుడి మృతి

image

హాలహర్వి మండలం నిట్రవట్టిలో మనోజ్ కుమార్(9) అనే బాలుడు ఆదివారం నీటి కుంటలో పడి మృతిచెందాడు. గ్రామంలోని వడ్డే మల్లికార్జున, మీనాక్షి దంపతులకు ముగ్గురు సంతానం. మూడో సంతానం మనోజ్ కుమార్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News June 10, 2024

కూర బాగోలేదంటూ భర్త కొట్టాడని భార్య సూసైడ్

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన కుంచే గంగాభవాని(30) చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు ఆదివారం తెలిపారు. కూర బాగోలేదని భర్త కొట్టడంతో గంగాభవాని మనస్థాపం చెంది ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. దీనిపై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 10, 2024

కడప: మూడు పార్టీలు.. ముగ్గురు ఎంపీలు

image

కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు పార్టీల తరఫున ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ఏలూరు పార్లమెంటు(టీడీపీ) నుంచి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, అనకాపల్లి పార్లమెంట్(బీజేపీ) నుంచి సీఎం రమేశ్, కడప ఎంపీగా (వైసీపీ) వైఎస్ అవినాశ్‌రెడ్డి గెలిచారు. దీంతో మూడు పార్టీల ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే.