India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ముగుస్తున్న నేపాథ్యంలో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి వేటకు మత్స్యకారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తూర్పు తీరంలో విశాఖ చేపల రేవు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ 700 మరపడవలు, మరో వెయ్యి వరకు ఇంజిన్ పడవలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమపై ప్రత్యక్షంగా 15,000 మంది పరోక్షంగా 10వేల మంది ఆధారపడి ఉన్నారు. వేట ప్రారంభించే ముందు ఈనెల 11న గంగాదేవి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

బాపట్లలో అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు వేధిస్తున్నారని వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై బాపట్ల గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అవినాష్ రతన్‌తో వాసంతికి 2022లో వివాహమైంది. వివాహ సమయంలో రూ. 22 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కొంత కాలానికి అదనంగా కట్నం తీసుకురావాలని తనను భర్త అవినాష్ రతన్, అత్త, మామ వేధిస్తున్నారని వివాహిత ఫిర్యాదు చేసింది.

హాలహర్వి మండలం నిట్రవట్టిలో మనోజ్ కుమార్(9) అనే బాలుడు ఆదివారం నీటి కుంటలో పడి మృతిచెందాడు. గ్రామంలోని వడ్డే మల్లికార్జున, మీనాక్షి దంపతులకు ముగ్గురు సంతానం. మూడో సంతానం మనోజ్ కుమార్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన కుంచే గంగాభవాని(30) చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు ఆదివారం తెలిపారు. కూర బాగోలేదని భర్త కొట్టడంతో గంగాభవాని మనస్థాపం చెంది ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. దీనిపై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు పార్టీల తరఫున ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ఏలూరు పార్లమెంటు(టీడీపీ) నుంచి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, అనకాపల్లి పార్లమెంట్(బీజేపీ) నుంచి సీఎం రమేశ్, కడప ఎంపీగా (వైసీపీ) వైఎస్ అవినాశ్‌రెడ్డి గెలిచారు. దీంతో మూడు పార్టీల ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే.

చీరాలకు చెందిన మువ్వల చంద్రశేఖర్ ఇంగ్లండ్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. 20 ఏళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నిమిత్తం కుటుంబంతో ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో రెండుసార్లు పురపాలక సంఘం కౌన్సిలర్‌గా గెలిచారు. అక్కడ అధికార పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. లండన్‌కు సమీపంలోని స్లవ్ పార్లమెంటు స్థానానికి చంద్రశేఖర్ శుక్రవారం నామినేషన్ వేశారు.

కావలి పట్టణంలో ఆదివారం జబర్దస్త్ ఫేమ్ అప్పారావు సందడి చేశారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యుల నేతృత్వంలో స్థానిక నాగరాజు షాప్ వద్ద రెండు నెలలుగా నిర్వహిస్తున్న చలివేంద్రం, అన్న దాన కేంద్రాన్ని నిర్వాహక భాగస్వామి నాగరాజు ఆహ్వానం మేరకు సందర్శించారు. అప్పారావు మాట్లాడుతూ.. సేవా భావంతో నెలల తరబడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

నరసాపురం MPగా తొలిసారి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. ఈ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. సినీ నటుడు కృష్ణంరాజు(BJP) తొలిసారి కాకినాడ MPగా గెలవగా.. 1999లో నరసాపురం నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పాలకొల్లుకు చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు, మొగల్తూరుకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నరసాపురం కోడలు నిర్మలా సీతారామన్ రాజ్యసభ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా చేశారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం ఒకేరోజు వివిధ కారణాలతో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాలలో విషాదం నెలకొంది. జిల్లాలోని పుట్లూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, పెద్దపప్పూరు, అమడగూరు, సోమందేపల్లి మండలాలలో ఈ ఘటనలో చోటుచేసుకున్నాయి. వ్యవసాయ సాగులో నష్టం భరించలేక ఒకరు, కుటుంబ కలహాలతో మరొకరు, ప్రేమించిన యువతి దక్కలేదని ఇంకొకరు.. ఇలా పలువురు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో YCP, TDPలకు SDPI గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహబూబ్ బాషా అధ్యక్షతన శ్రీశైలం నియోజకవర్గ నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వార్డు, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.