India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్రమంత్రిగా ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విటర్‌లో ట్రెండవుతున్నారు. నరేంద్రమోదీ క్యాబినెట్‌లో సముచిత స్థానం పొందిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతుండటంతో Congratulations Anna అనే కీవర్డ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది. వందల సంఖ్యలో నెటిజన్లు రామ్మోహన్‌ను అభినందిస్తూ ఈ మేరకు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.

గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.

గత రెండు నెలలుగా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులు వేట నిషేధించిన విషయం తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్స్ తిరిగి తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్న క్యాంటీన్స్ తెరవనున్నట్లు టీడీపీ ఒక ప్రకటన విడుదుల చేసింది. రూ.5లకే నిరు పేదలకు అల్పాహారం అందించే ఉద్దేశ్యంతో 2014లో ఈ క్యాంటీన్స్ ప్రారంభించగా.. 2019లో వైసీపీ అధికారంలో రావడంతో అవి మూతపడ్డాయి. ఇప్పుడు తిరిగి తెరుచుకోనుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898-AD’ ట్రైలర్ నేడు విడుదలకానుంది. ఉమ్మడి ప.గో జిల్లా అభిమానుల కోసం పలు థియేటర్లలో సోమవారం 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. భీమవరం-విజయలక్ష్మి, ఏలూరు-శ్రీ బాలాజీ, తణుకు-లక్ష్మీ, తాడెపల్లిగూడెం-లక్ష్మీనారాయణ, నరసాపురం- శ్రీ రాజరాజేశ్వరి, జంగారెడ్డిగూడెం- రాజరాజేశ్వరి థియేటర్‌లలో ట్రైలర్ స్కీనింగ్ చేస్తారు. SHARE IT..

ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆదివారం అనంతపురం జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. వీరిలో రాష్ట్ర బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అంకుల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చిరంజీవి రెడ్డి, కడప అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు హాజరై స్వీకారోత్సవం వేడుకలను తిలకించారు.

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898-AD’ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఉమ్మడి తూ.గో జిల్లా అభిమానుల కోసం పలు థియేటర్లలో సోమవారం 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. రాజమండ్రి- సూర్య ప్యాలెస్, కాకినాడ-లక్ష్మి, అమలాపురం- వెంకట పద్మావతి, రావులపాలెం- అక్షర, మండపేట-కృష్ణ థియేటర్‌లలో ట్రైలర్ స్కీనింగ్ చేస్తారు. SHARE IT..

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవాడలోని ఎన్జీవో హోంలో జరిగాయి. ఈ కౌన్సిల్‌లో రాష్ట్ర కమిటీలోకి కర్నూలు జిల్లాకు చెందిన కరె కృష్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా గట్టు తిమ్మప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సంఘం నాయకులు తెలిపారు. ఎన్నికైన వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898 AD’ మూవీ ట్రైలర్ నేడు విడుదలకానుంది. అభిమానుల కోసం శ్రీకాకుళం జిల్లాలోని పలు థియేటర్లలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. పలాస- హరిశంకర్, పాలకొండ- రామ కళామందిర్, రాజాం- అప్సర, శ్రీకాకుళం- సరస్వతి మహల్, SVC రామలక్ష్మణ థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT..

కక్ష సాధింపులు మా అభిమానం కాదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు ఎవరు పాల్పడకూడదని ఆదేశించారన్నారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేవలం 11 సీట్లు సాధించారంటే ఎంత దుర్మార్గమైన పాలన ప్రజలకు అందించారో తేలిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.