Andhra Pradesh

News June 10, 2024

జూన్ 12న విశాఖ- చెన్నై వెళ్లి, వచ్చే వాహనాల దారి మళ్లింపు

image

గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.

News June 10, 2024

12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ మళ్లింపు

image

గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి విశాఖపట్నం వైపు మళ్లిస్తామన్నారు.

News June 10, 2024

పాడేరు: మోదకొండమ్మ జాతరలో ఐఏఎస్ అధికారుల సందడి

image

పాడేరులో ఆదివారం నుంచి జరుగుతున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరలో ఐఏఎస్ అధికారులు సందడి చేస్తున్నారు. ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత భక్తులతో కలిసి స్వయంగా ఘటాలను ఊరేగింపుగా శతకం పట్టుకు తరలించారు. ఆదివారం రాత్రి జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తదితరులు జాతరలో సందడి చేశారు. జాతరలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జెయింట్ వీల్, ట్రైన్ ఎక్కి సందడి చేశారు.

News June 10, 2024

గన్నవరంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ మళ్లింపు

image

గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి విశాఖపట్నం వైపు మళ్లిస్తామన్నారు.

News June 10, 2024

ఎన్టీఆర్ జిల్లాలో 12వ తేదీన ట్రాఫిక్ మళ్లింపు

image

గన్నవరంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా 12వ తేదీన జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు గామన్ బ్రిడ్జి- దేవరపల్లి- జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు. హనుమాన్ జంక్షన్ నుండి వచ్చే వాహనాలు నూజివీడు- మైలవరం- ఇబ్రహీంపట్నం- నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు.

News June 9, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో “కల్కి” ట్రైలర్ ప్రదర్శించేది ఎక్కడంటే.!

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది.  విజయవాడ- అలంకార్, సాయిరాం స్క్రీన్స్‌, గుడివాడ- భాస్కర్ కాంప్లెక్స్, ఉయ్యూరు- సాయి మహల్, మచిలీపట్నం- రేవతి & శ్రీ కృష్ణా కాంప్లెక్స్‌, నూజివీడు-ద్వారకా స్క్రీన్ 2 అన్నారు.

News June 9, 2024

గుంటూరు జిల్లాలో రేపు “కల్కి” ట్రైలర్ ప్రదర్శించేది ఎక్కడంటే..

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది. గుంటూరు- భాస్కర్, తెనాలి- సంగమేశ్వర, నరసరావుపేట- రవికళా మందిర్, మాచర్ల- శ్రీనివాస, సత్తెనపల్లి- లక్ష్మీ, ఒంగోలు- గోరంట్ల కాంప్లెక్స్, చిలకలూరిపేట- సాయికార్తీక్

News June 9, 2024

నగరి : మోడీకి శుభాకాంక్షలు తెలియజేసిన రోజా

image

నగరి: భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోషల్ మీడియా వేదికగా వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు అన్నారు.

News June 9, 2024

నెల్లూరు: కూలి పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

image

వరంగల్ జిల్లా నెక్కొండలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఎండీ.మీరా(45) అనే మహిళ మృతి చెందింది. నెక్కొండకు చెందిన తాపీ మెస్త్రి వెంకటేశ్వర్లు వద్ద మీరాతో పాటు ఆమె భర్త ఆరాఫత్ అలీ కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. స్థానికులు సముదాయించారు. ఆదివారం మీరా మృతి చెందగా, ఆమె భర్త కనిపించడం లేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News June 9, 2024

విశాఖ: రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవి శంకర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్‌లలో సంబంధిత రౌడీ షీటర్లకు పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరితే ‌పీడీ యాక్ట్ అమలు చేయాల్సి వస్తుందని అన్నారు.