India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితాలో స్థానం దక్కింది. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి విశాఖపట్నం వైపు మళ్లిస్తామన్నారు.

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. కడప జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. కడప- అప్సర, ప్రొద్దుటూరు- అరవేటి థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. చిత్తూరు జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు.చిత్తూరు- MSR
తిరుపతి- సంధ్య, పీలేరు- అజంతా, పుంగనూరు- బాలాజీ, నగరి- శ్రీనివాసక్యూబ్, శ్రీకాళహస్తి- RR, మదనపల్లె- రవి,
పలమనేరు- రంగ మహాల్ థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు.
SHARE IT

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కాగా పెమ్మసాని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు నేతలు పెమ్మసానిని అభినందించారు.

వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లెలో పట్టపగలే దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గిరి చౌదరి అనే వ్యక్తిని సాయంత్రం కొందరు దారుణ హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న వెల్దుర్తి పోలీసులు ఘటనా స్థలం చేరుకుని హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. నెల్లూరు జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. నెల్లూరు – లీలా మహాల్, సూళ్లూరుపేట- V EPIQ, గూడూరు- సంగం, కావలి- మాసన స్రీన్-1 థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT

విశాఖ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావటంతో బీచ్‌లో సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకుల రద్దీ పెరగటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. RK బీచ్, భీమిలి బీచ్‌లలో కూడా ఇదే పరిస్థితి. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో పిల్లలతో బీచ్‌లకు పోటెత్తారు.

వెంకటగిరిలోని పినాకిని బార్ సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేశారు. పినాకిని బార్ సమీపంలో కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న నరసింహ అనే వ్యక్తి వెంకటగిరి ప్రాంతానికి చెందిన బొక్కిసం విజయ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య అనంతరం నరసింహ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, విచారణ చేపట్టారు.

* తెనాలి మం. బుర్రిపాలెంలో 1976 మార్చి 7న జననం
* తల్లిదండ్రులు: సాంబశివరావు, సువర్ణ
* భార్య: శ్రీరత్న, సంతానం: అభినవ్, సహస్త్ర
* 1993-94లో MBBS ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు
* HYD ఉస్మానియా To 2000లో PG కోసం అమెరికా
* USలో మెడికల్ స్టూడెంట్స్ కోసం శిక్షణ సంస్థ ప్రారంభం
* అనతి కాలంలోనే రూ.వేల కోట్లు ఆర్జన
* 2019లో నరసరావుపేట MP టికెట్ కోసం ప్రయత్నం
* 2024లో గుంటూరు MPగా 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలుపు
Sorry, no posts matched your criteria.