India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ యువతి ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు పట్టణం హనుమేశ్ నగర్ కు చెందిన నవ్య బీటెక్ CSE ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థిని హాస్టల్ గదిలో గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఆమంచి అన్నదమ్ములు సైలెంట్ ఆసక్తి రేపుతోంది. కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. 2019లో కరణం బలరాం చేతిలో ఓడిపోవడంతో ఆయన్ను పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ నియమించింది. తాజాగా పర్చూరు టికెట్ యడం బాలాజీకి కేటాయించింది. మరోవైపు ఆమంచి స్వాములు జనసేన నుంచి గిద్దలూరు టికెట్ ఆశించినా దక్కలేదు. సీటు రాని ఆమంచి సోదరులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఆర్మీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించి ఈనెల 22వ తేదీ శుక్రవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న అభ్యర్థులు జాయిన్ఇండియన్ఆర్మీ. ఎన్ఐసీ. ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరిట వేధిస్తున్న ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై ప్రియ కుమార్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన బాలిక(17) మచిలీపట్నంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలిక సొంతూరుకు చెందిన యువకుడు ప్రేమించాలంటూ కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా శబిరి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.
జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వీర్ల జ్యోతిబసు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో సొంత జిల్లాల్లో విధులు నిర్వహించే వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు జ్యోతి బసును బదిలీ చేశారు.
నెల్లూరు MLAలుగా ఇప్పటి వరకు 14 మంది గెలిచారు. ఇందులో తక్కువ మెజార్టీ(90) ముంగమూరు శ్రీధర్ రెడ్డిది కాగా అత్యధిక మెజార్టీ(31,268) కేవీ సుబ్బారెడ్డిది. 2009లో ముంగమూరు PRP తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌పై గెలిచారు. 1978లో KV సుబ్బారెడ్డి కాంగ్రెస్.ఐ తరఫున బరిలో నిలిచి జనతా అభ్యర్థి ఆనం వెంకట రెడ్డిపై విజయం సాధించారు. ఈసారి ఈ రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో చూడాలి.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్‌లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోర సుధాకర్ రెడ్డి (40) తన అన్న సురేశ్ రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. తనకి వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై అందరితోనూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పార్వతీపురానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని దిగాలుగా ఉండడంతో, గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిపాడు. బెటర్ మెంట్‌లో మార్కులు తెచ్చుకోవచ్చని వారు సర్ది చెప్పినా, మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామ సచివాలయాలకు చెందిన 37 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీఓవో కె.జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఒక సమావేశానికి హాజరయ్యారని ఆమె తెలిపారు. అనంతరం చేబ్రోలు-1 గ్రామ సచివాలయంకు చెందిన ముగ్గురు, చేబ్రోలు-2కు చెందిన 7గురు, చేబ్రోలు-3కు చెందిన 4గురు, చేబ్రోలు-4కు చెందిన 6గురు, చేబ్రోలు-5కు చెందిన 14మందిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.