India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇవాళ విడుదలైన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో గూడూరుకు చెందిన దివ్య పూర్ణచంద్ ఆల్ ఇండియా 98వ ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 10వ తరగతి వరకు గూడూరులోని ఓ పాఠశాలలో చదివి అనంతరం ఇంటర్మీడియట్ విజయవాడలో చదివారు. ఈ నీట్ పరీక్షలో 98వ ర్యాంకు సాధించడం పట్ల అధ్యాపకులు, విద్యార్థి తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.

కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌కు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. ‘నా స్నేహితుడు రామ్మోహన్‌కు అభినందనలు. రామ్మోహన్ చిత్తశుద్ధి, నిరాడంబరత దేశాభివృద్ధికి మూలధనం వంటింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శుభాకాంక్షలు’ అంటూ గల్లా Xలో పోస్ట్ చేశారు.

టీడీపీ నుంచి 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా MPగా గెలిచిన ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు. 2014లో రామ్మోహన్‌తో పాటు జయదేవ్(గుంటూరు), కేసినేని నాని (విజయవాడ) గెలిచారు. 2019లోనూ వీరు ముగ్గురు విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో జయదేవ్ పోటీ నుంచి తప్పుకోగా.. నాని విజయవాడలో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో గత 3 లోక్‌సభలలో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీగా రామ్మోహన్ నిలిచారు.

కొత్తపల్లి మండల పరిధిలో ప్రవహించే కృష్ణ నది తీరంలో వలస పక్షులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. సంగమేశ్వరం ఆలయ సమీపంలో ఒకవైపు పచ్చదనంతో కూడుకున్న నల్లమల అడవులు మరోవైపున ప్రవహించే కృష్ణ నది తీరంలో వలస పక్షుల అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సంగమేశ్వరం ఆలయానికి వచ్చిన భక్తులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ రికార్డు సృష్టించారు. 2009లో కోవూరు నుంచి టి.మునెమ్మ(PRP) పోటీ చేసి ఓడిపోగా ఈఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి గెలిచి తొలిమహిళా MLAగా రికార్డు తిరగరాశారు. అదేవిధంగా సూళ్లూరుపేటలో 2009లో వి.సరస్వతి(కాంగ్రెస్) పోటీ చేసి ఓడిపోగా.. ఈఎన్నికల్లో నెలవల విజయశ్రీ.. సంజీవయ్యపై గెలిచి తొలి మహిళా MLAగా రికార్డు సృష్టించారు.

భూపతిరాజు శ్రీనివాసవర్మ 1967లో భీమవరంలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణరాజు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఈయన BJYM జిల్లా అధ్యక్షుడు(1991-95), BJP ప.గో జిల్లా సెక్రెటరీ(1997-99), నరసాపురం పార్లమెంట్ కన్వీనర్(1999-2001), BJP నేషనల్ కౌన్సిలర్ మెంబర్(2001-03)గా చేశారు. 2009లో ఎంపీగా పోటీ, బీజేపీ ఉమ్మడి ప.గో జిల్లా అధ్యక్షుడు(2010-18), 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని అనంతపురం ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి పికెట్లు ఏర్పాటు చేసి మొబైల్ పార్టీలు తిప్పుతున్నామన్నారు. ముఖ్యమైన గ్రామాల్లో ఏపీఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపామని చెప్పారు. ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా FIR నమోదు చేస్తున్నామన్నారు. నాన్ కాగ్నిజబుల్ నేరమైనా కోర్టు అనుమతితో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరం మండలం బాలాంత్రం లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఎరుపు అక్షరాలతో ఉత్తరం రాసి చేతికి తగిలించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో హుటాహుటిన క్లూస్ టీంతో చేరుకొని పరిశీలిస్తున్నారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,557 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి శనివారం రూ.2.90 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం వెల్లడించింది

మండలంలోని బోగోలు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్‌గా స్థానికులు గుర్తించారు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.