Andhra Pradesh

News March 21, 2024

‘అంబికా లక్ష్మీనారాయణకే హిందూపురం టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వాలి’

image

హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ.. హిందూపురం పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్థ నారాయణరెడ్డి, నాగరాజు, ఆదినారాయణ శ్రీరాములు, ఆనంద్ పాల్గొన్నారు.

News March 21, 2024

తిరుపతి: కానిస్టేబుల్ సస్పెండ్

image

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియమాలను ఉల్లంఘించరాదని ఎస్పీ హెచ్చరించారు. నారా భువనేశ్వరిని కలవడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం.

News March 21, 2024

కడపకు సీఎం జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఇదే

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 27న కడప జిల్లాలో జరగనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రూట్ మ్యాప్‌లో రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, అనంతరం వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని పేర్కొన్నారు.

News March 21, 2024

గుంటూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులపై కేసు నమోదు

image

గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ, వైసీపీ శ్రేణులపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరేష్ వివరాలు మేరకు.. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ ఇంటి వద్ద వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోవడానికి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలపై 2 పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

News March 21, 2024

మచిలీపట్నం: ఆరుగురు వాలంటీర్లపై వేటు

image

మచిలీపట్నం మండలం చిన్నాపురంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్లు పై అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆరుగురు వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ MPDO ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు నిబంధనలు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు నేతలు ఆరోపిస్తున్నారు.

News March 21, 2024

విమానాలకు పక్షుల అంతరాయాన్ని నివారించేందుకు స్ప్రే డ్రోన్లు

image

విశాఖ విమానాల రాకపోకలకు పక్షులు అంతరాయాన్ని నివారించేందుకు తూర్పు నావికాదళంలో వైమానిక బృందం స్ప్రే డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి వీటి ఆపరేషన్స్‌ చేపడుతున్నారు. తద్వార పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమని భావిస్తున్నారు.

News March 21, 2024

ప.గో: ఇంగ్లీష్ పరీక్షకు 665 మంది విద్యార్థులు డుమ్మా!

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. ఇంగ్లీష్ పరీక్షకు 21,238 మందికి గాను 20,573 మంది హాజరయ్యారని, 665 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

News March 21, 2024

అనకాపల్లి: ఏ.ఎల్ పురం చెక్‌పోస్టు వద్ద రూ.లక్ష సీజ్

image

గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో ఆధారాలు లేని రూ.లక్ష నగదు సీజ్ చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన నానిబాబు తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా.. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేశామన్నారు. ఏ ఆధారాలు లేని రూ.లక్ష సీజ్ చేసి.. నగదును తహశిల్దార్‌కి పంపించామన్నారు.

News March 21, 2024

విజయనగరంలో గంజాయితో వ్యక్తి అరెస్టు 

image

విజయనగరం రైల్వే స్టేషన్ పక్కన గల ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ వద్ద అనుమానాస్పదంగా గంజాయితో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు తెలిపారు. అతని వద్ద నుంచి 9 కిలోల గంజాయి, రూ.1070 నగదు, ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు.

News March 21, 2024

అల్లూరి: ‘సింగిల్ విండో విధానంలో అనుమతులు’

image

పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని జేసీ భావన వశిస్ట్, ITDA పీఓ వి.అభిషేక్ అన్నారు. పాడేరు కలెక్టరేట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాలకు ఎన్నికల పోర్టల్స్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సువిధ యాప్ నుండి దరఖాస్తులు స్వీకరించి, ఎన్‌కోర్ యాప్ నుంచి అనుమతులు జారీ చేస్తామన్నారు. రిటర్నింగ్ అధికారుల ఆమోదం లేకుండా ఎటువంటి అనుమతులు జారీ చేయకూడదన్నారు.

error: Content is protected !!