India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఏపీ ఎడ్ సెట్ -2024 పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా నుంచి 992 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 876 మంది హాజరయ్యారు. 116 మంది గైర్హాజరయ్యారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్ పరీక్ష కేంద్రంలో 330 మందికి 295 మంది, టెక్కలి ఐతం కళాశాలలో 302 మందికి 278 మంది, చిలకపాలెంలోని శివాని ఇంజనీరింగ్ కాలేజీలో 180 మందికి 153 మంది, వెంకటేశ్వరలో 180మందికి 150మంది హాజరయ్యారు.

అల్లూరి ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోదకొండమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శతకం పట్టు వద్దకు ఘటాలను ఊరేగింపుగా తరలించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తాజా ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూటమికి 15,431(63.72) మంది ఉద్యోగులు ఓట్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెత్తం 24,216 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వారిలో కేవలం 5,925(24.47) మంది మాత్రమే వైసీపీకి ఓటు వేశారు. మరోవైపు ఇండియా కూటమికి 1,580(6.52) మంది ఓటు వేశారు. కాగా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

1995 నుంచి 2000 వరకు ఈనాడులో జర్నలిస్టుగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు.. నేడు విజయగనం ఎంపీ అయ్యారు. ఈనాడు సంస్థ ఉద్యోగిగా ఉన్న తాను ఎంపీగా ఎదగడానికి రామోజీరావే స్ఫూర్తి అని ఆయన తెలిపారు. జీవిత పాఠాలు నేర్పిన ఆయన ఇక లేరన్న విషయం కలిచివేసిందన్నారు. జీవితాంతం రామోజీరావుకు రుణపడి ఉంటానన్న కలిశెట్టి.. రామోజీరావును తలుచుకున్న ప్రతిసారీ కన్నీరు వస్తుందన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ శోభారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో ఆమె రూ. 21,53,110వరకు నగదు అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపించిన ఉన్నతాధికారులు శోభారాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకున్నారు.

ప.గో లోక్‌సభ స్థానంలో15,165 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 8,707(57..41%) ఓట్లు కూటమికి పడ్డాయి. వైసీపీకి 5,176(33.13%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 1,006(6..63%) మంది మాత్రమే ఓటు వేశారు.

విజయనగరం MP స్థానంలో 22,301 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా 13,329(59.74%) ఓట్లు NDAకి పడ్డాయి. YCPకి 6,071(27.21%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 353(1.58%) మంది మాత్రమే ఓటు వేశారు. అరకు MP స్థానంలో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా కూటమికి 9,312(43.44%) ఓట్లు పడ్డాయి. YCPకి 5,535(25.83%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 4,113(19.19%) మంది ఓటు వేశారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇదే అత్యధికం.

తాజా ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP అభ్యర్థులు గెలిచారు. త్వరలో చంద్రబాబు CMగా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో కృష్ణా నుంచి మంత్రివర్గంలో ఎవరు చోటు దక్కించుకుంటారనే చర్చ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జరుగుతోంది. కొల్లు రవీంద్ర, వెనిగండ్ల రాము, జనసేన నుంచి మండలి బుద్దప్రసాద్, ముందువరుసలో ఉన్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని అనకుంటున్నారో COMMENT చేయండి.

గత ఎన్నికల్లో YCP గిద్దలూరు నియోజకవర్గంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి సైకిల్ జోరందుకుంది. 2019 ఎన్నికల్లో గిద్దలూరు YCP ఎమ్మెల్యే అన్నా రాంబాబు TDP MLA అభ్యర్థి అశోక్ రెడ్డిపై 81,035 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా 2024 ఎన్నికల్లో పరిస్థితి తలక్రిందులైంది. TDP అభ్యర్థి అశోక్ రెడ్డి నాగార్జునరెడ్డిపై 973 ఓట్లతో విజయం సాధించారు. దీంతో ఓటమికి గల కారణాలు ఏంటా అని ప్రశ్నించుకుంటున్నారు.

శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో 27,041 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 19,827(73.32%) ఓట్లు కూటమికి పడ్డాయి. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. వైసీపీకి 6,033(22.31%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి కేవలం 448(1.66%) మంది మాత్రమే ఓటు వేశారు.
Sorry, no posts matched your criteria.