India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి తూ.గో. జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా, పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటకు చెందిన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి పేరి కామేశ్వరరావు (పీకే రావు) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కార్పొరేషన్ సెక్రటరీకి పంపినట్లు తెలిపారు.

కావలి పట్టణంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఉదయగిరి వంతెన సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వయసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.మృతుడు స్కై బ్లూ కలర్ హాఫ్ హాండ్ టీ షర్ట్ , బులుగు లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని కోరారు.

మాజీ సీఎం జగన్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ అన్నారు. శనివారం అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో అరాచకాలు విధ్వంసాలు కక్ష సాధింపులకు తెగపడి ఆస్తులు నష్ట పరిచారని విమర్శించారు. జగన్ ఒక్కరోజులోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం సరికాదన్నారు.

ఎన్నికల సమయంలో కడప ఎక్సైజ్ డివిజన్ పరిధిలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మే నెలలో రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప డివిజన్ పరిధిలో 40 ప్రభుత్వ దుకాణాలు, 14 బార్లు ఉన్నాయి. వాటి నిర్వాహకులు మేలో ఎక్సైజ్ డిపో నుంచి రూ.34.56 కోట్ల విలువ చేసే మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయించారని ఎక్సైజ్ డిపో మేనేజర్ ధనుంజయకుమార్ తెలిపారు.

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు మాస్ కాఫీయింగ్‌కు పాల్పడుతూ డీబార్ అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 87 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91 శాతం విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాలను బియ్యపు గింజలపై పెయింటింగ్ వేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

అనంత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మినహా ఇతర అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇందులో జాతీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసిన 134 మంది అభ్యర్థుల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు 18 మంది పోగా మిగిలిన 116 మంది అభ్యర్థులు డిపాజిట్ దక్కించుకునేందుకు సరిపడా ఓట్లను సాధించలేక పోయారు.

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితా లో స్థానం దక్కినట్లు సమాచారం. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకోవడం గ్రేట్ అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

గత 5 ఏళ్లలో చంద్రగిరిలో ఎలాంటి అల్లర్లు జరగలేదని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. గెలిచిన వారు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. ‘అభివృద్ధిలో దేశానికి చంద్రగిరి ఆదర్శంగా నిలవడానికి రూ.950 కోట్లతో పనులు చేశా. 1600 KM పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నా. కానీ మార్పు కోరి TDPకి అవకాశం ఇచ్చారు. వారి తీర్పును గౌరవిస్తున్నా. నాకు లక్ష ఓట్లు వేశారు. వాళ్లు అందరికీ పాదాభివందనం’ అన్నారు.

నూజివీడు నియోజకవర్గంలో నోటా ( NOTA – None of the above)కు భారీగా 2,771 ఓట్లు పడ్డాయి. నూజివీడు లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మరీదు కృష్ణ సాధించిన ఓట్ల (2405) కంటే నోటా సాధించిన ఓట్లే అత్యధికం. కాగా నూజివీడులో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై 12,378 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.