Andhra Pradesh

News June 8, 2024

రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవు: ఎస్పీ

image

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే.. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం వాట్సప్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నట్టు సమాచారం వస్తోందని, అలాంటి పోస్టులకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు.

News June 8, 2024

పార్వతీపురం: రైలు కిందపడి యువకుడు మృతి

image

రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం దాలినాయుడు వలస రైల్వే గేట్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణం బూరాడ వీధికి చెందిన తెంటు భరత్ (31) రైల్వే గేట్ దాటుతుండగా గూడ్స్ ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News June 8, 2024

మాజీ మంత్రి జక్కంపూడి సోదరుడు కన్నుమూత

image

మాజీ మంత్రి, స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు (చిన్ని) శనివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్ని మరణ వార్తతో జక్కంపూడి అభిమానులు నారాయణపురంలోని వారి నివాసానికి చేరుకుని చిన్ని పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

News June 8, 2024

కడప: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన అలీ 

image

13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ అలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం అలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి తెస్తానన్నారు. 

News June 8, 2024

ప.గో: ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

News June 8, 2024

TPT: SV యూనివర్సిటీ నుంచి రామోజీరావుకు డాక్టరేట్

image

తిరుపతి : మీడియా మొగల్, రామోజీ గ్రూప్స్ సంస్థ అధినేత రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన తన జీవిత ప్రస్థానంలో అనేక పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఇందులో భాగంగా 1989వ సంవత్సరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ ను అందజేసింది.

News June 8, 2024

అల్లూరిలో అభ్యర్థి ఎవరైనా వైసీపీదే విజయం

image

అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.

News June 8, 2024

అల్లూరిలో అభ్యర్థి ఎవరైనా వైసీపీదే విజయం

image

అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.

News June 8, 2024

అనంత: రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల రాజీనామా

image

రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు.
అనంతపురం వైసీపీ నాయకుడు అనిల్ గౌడ్ సతీమణి ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఓటమి చెందడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని అందించారు.

News June 8, 2024

కర్నూలు: జీడీపీకి చేరుతున్న వరద నీరు

image

గాజులదిన్నె ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీడీపీలోకి దాదాపు 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ఏఈ మహమ్మద్ అలీ తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 0.7 టీఎంసీలకు చేరిందని వెల్లడించారు. 4.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం కర్నూలుకు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు తెలిపారు.