India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావించి “పోలీస్ వెల్ఫేర్ డే” ని జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. పారదర్శకతతో కోరుకున్న చోటుకే ఖాళీల ఆధారంగా స్థానచలనం చేశారు.

తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. తుమ్మల గుంటలోని వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రజల కోసం కష్టపడ్డామని, 980 కోట్లరూపాయలతో చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. కరోనా కాలంలోనూ ప్రజలను ఆదుకున్నామని అన్నారు. పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

లా సెట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు లా సెట్ కన్వీనర్ తెలిపారు. నంద్యాలలోని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.

ఏపీ ఉన్నత విద్యా మండలి(APSCHE) ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష- లాసెట్, ఏపీ పీజీ లాసెట్- 2024 పరీక్షలు రేపు ఆదివారం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 2.30- 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ సత్యనారాయణ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ పరీక్ష హాల్‌టికెట్లను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకం, అభినందనీయమని జేసి లావణ్య వేణితో పాటు పలువురు రిటర్నింగ్ అధికారులు అన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏలూరులో కలెక్టర్‌కి అభినందనలు తెలిపారు.

రైల్వే కోడూరు మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవరంలోని పోడు హరిజనవాడ సమీపంలో కడప-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ ఓ వ్యానును బలంగా ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో డ్రైవర్లు ఊపిరి తీసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఏపీ ఉన్నత విద్యా మండలి(APSCHE) ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష- లాసెట్, ఏపీ పీజీ లాసెట్- 2024 పరీక్షలు రేపు ఆదివారం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 2.30- 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ సత్యనారాయణ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ పరీక్ష హాల్‌టికెట్లను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని లగేజ్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్ఓ అమర(40) మృతిచెందాడు. గార్లదిన్నె మండలం కమలాపురానికి చెందిన అమర పామిడి మండలం కత్రిమల వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. పామిడి నుంచి కల్లూరుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా కల్లూరు నుంచి పామిడి వైపు వెళ్తున్న లగేజ్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమర అక్కడికక్కడే మృతిచెందారు.

చేజర్ల మండలంలోని పలు గ్రామాలలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అదురుపల్లి, ఏటూరు, నాగుల వెల్లటూరు తదితర గ్రామాలలో గాలితో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇన్ని రోజులు ఉక్కపొతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. చిరు వ్యాపారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.

డీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ పదవికి వైసీపీ నేత విజయ మనోహరి శనివారం రాజీనామా చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతి తక్కువ సమయం ఛైర్మన్‌గా పనిచేశానని అన్నారు. విధి నిర్వహణలో తనకు సహాయ సహకారాలు అందించిన బ్యాంకు అధికారులకు, సిబ్బందికి, APCOB వారికి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన 99 సహకార సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని అన్నారు.
Sorry, no posts matched your criteria.