Andhra Pradesh

News June 8, 2024

డీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ పదవికి విజయ మనోహరి రాజీనామా

image

డీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ పదవికి వైసీపీ నేత విజయ మనోహరి శనివారం రాజీనామా చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతి తక్కువ సమయం ఛైర్మన్‌గా పనిచేశానని అన్నారు. విధి నిర్వహణలో తనకు సహాయ సహకారాలు అందించిన బ్యాంకు అధికారులకు, సిబ్బందికి, APCOB వారికి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన 99 సహకార సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని అన్నారు.

News June 8, 2024

ప.గో: హత్య కేసులో కొవ్వూరు వాసికి 10ఏళ్లు జైలు శిక్ష

image

కొవ్వూరుకు చెందిన చిట్టిబాబు, మహేశ్వరరావు కొండాపూర్‌కు పనికి వెళ్లారు. 2022 ఏప్రిల్ 16న చిట్టిబాబు కుమారుడు దుర్గాప్రసాద్ కొండాపూర్ రాగా మహేశ్వరరావు అతనిని తిట్టాడు. దీంతో మాటామాటా పెరిగి చిట్టిబాబు కత్తితో మహేశ్వరరావుపై దాడి చేయడంతో మహేశ్వరరావు మృతిచెందాడు. దీంతో రెండేళ్ల విచారణ అనంతరం చిట్టిబాబుకు 10ఏళ్ల జైలు, రూ.25 వేలు జరిమానా విధించినట్లు గచ్చిబౌలి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 

News June 8, 2024

కర్నూలు: పోలీసులనూ వదలని సైబర్ నేరగాళ్లు

image

కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా పోలీసులకు సైతం కుచ్చుటోపీ పెట్టి సవాల్ విసురుతున్నారు. తాజాగా కోడుమూరు సీఐ మన్సురుద్దీన్ అకౌంట్ నుంచి రూ.2.20 లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న తన ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు సీఐ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News June 8, 2024

శ్రీకాకుళం: కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా

image

ఏపీ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తోలాపి గ్రామానికి చెందిన దుంపల రామారావు 2024లో కళింగ కోఆపరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సేవలు అందించే లోపే పార్టీ అధికారం కోల్పోవడం బాధాకరమన్నారు. తన రాజీనామా పత్రాన్ని బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి పంపించానన్నారు. వైఎస్ జగన్‌కు, వైసీపీ నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు.

News June 8, 2024

అనంతసాగరం: సోమశిలకు వరద నీరు రాక

image

అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద వస్తోంది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా శనివారం నాటికి జలాశయంలో 7.293 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 521 క్యూసెక్కుల వరద వస్తోంది. పెన్నా డెల్టాకు 200, దక్షణ కాలువకు 5, ఉత్తర కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 68 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

News June 8, 2024

తిరుపతి : శ్రీ సిటీలో 50 ఉద్యోగాలు

image

శ్రీ సిటీలోని NS ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. బీఎస్సీ, డిప్లమా, ఐటిఐ పూర్తి చేసిన, 26 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 50 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/8wFL3GvvGZjLi4oA9 వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 8, 2024

విజయవాడ: జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు 

image

ముస్తాబాద్- గన్నవరం సెక్షన్‌లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.12806 జన్మభూమి SF ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ శనివారం నుంచి జూన్ 30 వరకు విజయవాడ- ఏలూరు- టీపీగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. జూన్ 30 వరకు ఈ ట్రైన్‌కు నూజివీడు, ఏలూరు, టీపీగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు. 

News June 8, 2024

ఉప్పాడ: కోతకు గురవుతున్న బీచ్‌ రోడ్డు

image

తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ- కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీర ప్రాంత ప్రజల రక్షణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News June 8, 2024

అనంత: అనతికాలంలో ఎన్నికల బరిలో నిలిచి.. ఎమ్మెల్యేగా గెలిచి

image

టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉద్యమాలతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2017లో టీడీపీలో చేరిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఆయనపై 50కిపైగా కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. మడకశిరలో తక్కువ సమయంలోనే ప్రజాదరణతో గెలుపొందారు.

News June 8, 2024

ఏడీ సెట్-24 రద్దు: వైఎస్ఆర్‌ఏఎఫ్ యూలో నేరుగా ప్రవేశాలు

image

కడప నగర పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఏడీసెట్-2024 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ను రద్దు చేసినట్లు ఏడీసెట్ చైర్మన్ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.