India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తోలాపి గ్రామానికి చెందిన దుంపల రామారావు 2024లో కళింగ కోఆపరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సేవలు అందించే లోపే పార్టీ అధికారం కోల్పోవడం బాధాకరమన్నారు. తన రాజీనామా పత్రాన్ని బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి పంపించానన్నారు. వైఎస్ జగన్‌కు, వైసీపీ నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు.

అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద వస్తోంది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా శనివారం నాటికి జలాశయంలో 7.293 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 521 క్యూసెక్కుల వరద వస్తోంది. పెన్నా డెల్టాకు 200, దక్షణ కాలువకు 5, ఉత్తర కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 68 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

శ్రీ సిటీలోని NS ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. బీఎస్సీ, డిప్లమా, ఐటిఐ పూర్తి చేసిన, 26 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 50 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/8wFL3GvvGZjLi4oA9 వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ముస్తాబాద్- గన్నవరం సెక్షన్‌లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.12806 జన్మభూమి SF ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ శనివారం నుంచి జూన్ 30 వరకు విజయవాడ- ఏలూరు- టీపీగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. జూన్ 30 వరకు ఈ ట్రైన్‌కు నూజివీడు, ఏలూరు, టీపీగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ- కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీర ప్రాంత ప్రజల రక్షణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉద్యమాలతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2017లో టీడీపీలో చేరిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఆయనపై 50కిపైగా కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. మడకశిరలో తక్కువ సమయంలోనే ప్రజాదరణతో గెలుపొందారు.

కడప నగర పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఏడీసెట్-2024 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ను రద్దు చేసినట్లు ఏడీసెట్ చైర్మన్ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విశాఖలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని ఓ డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికులకు సహాయంతో గెడ్డలో పడిపోయిన వ్యక్తిని పోలీసులు బయటకు తీశారు. మృతుడు 45 వయస్సు పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ (2015-16, 2016-17 అడ్మిట్ బ్యాచ్) పరీక్షల టైం టేబుల్‌ను ఎగ్జామినేషన్ బీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులు గమనించగలరని ఆయన కోరారు.

వైసీపీ అధికారంలోకి రాగానే యర్రగొండపాలెంలోని పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేత వేగినాటి కోటయ్య పేరును తొలగించి.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేరు మార్చారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరలా వేగినాటి కోటయ్య పేరును ఇవాళ పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేతలు మారుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.