India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిక్కోలులో YCP ఘోరంగా చతికిలపడింది. గతంలో ఏ రాజకీయ పార్టీ ఇంత పరాభవం చెందలేదు. ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలోని ఒక MP, సహా 8 అసెంబ్లీలో ఓటమిపాలైంది. అసెంబ్లీలో జిల్లా నుంచి ఒక్క MLA కూడా లేరు. ఐదేళ్లలో జిల్లాలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకపోవడం, రోడ్లు శిథిలమైనా కనీసం మరమ్మతుల ఊసే లేకపోవడం, జిల్లా అభివృద్ధిని విస్మరించడంతో దాని ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోందని ప్రజలు నుంచి వినిపిస్తోంది.

ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ MLAగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది పోటీచేయగా.. అందులో మల్లిపూడి షర్మిల ఒక్కరే మహిళ. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆమెకు 1140 ఓట్లు వచ్చాయి. అయితే RRRకు 1,16,902 ఓట్లు రాగా.. 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

బిఈడి ప్రవేశాలకు సంబందించిన ఎడ్ సెట్-2024 ప్రవేశ పరిక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 90% మంది విద్యార్థులు హాజరయ్యారని అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస మోహన్ తెలిపారు. ఈ పరీక్షకు MVGR కళాశాలలో 120 మందికి 103 మంది విద్యార్థులు, సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి 131 మంది విద్యార్థులు, ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 500 మందికి 454 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేసారు.

నంద్యాల జిల్లాలో 16 మండలాలలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 65.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గోస్పాడు 46.2మి.మీ పాణ్యం 44.6, బండి ఆత్మకూరు 42.6, ఉయ్యాలవాడ 42.4, దొర్నిపాడు 42.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా గడివేముల 3.4 మిమీ, డోన్ 0.8 వర్షపాతం నమోదైంది.

కూడేరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి దానిలోని నగదును అపహరించారు. ఎంత మొత్తంలో నగదు అపహరించారో తెలియడం లేదు. స్టేట్ బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. పత్రికా రంగంలో కొత్త ఒరవడలు సృష్టించిన ఈనాడు దినపత్రిక విశాఖ నుంచే ఆయన ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ పత్రిక అపూర్వ ప్రజాధరణ పొందింది. అదేవిధంగా నగరంలో డాల్ఫిన్ హోటల్‌ను ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ ఆ డాల్ఫిన్ హోటల్‌కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.

రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని మాజీ మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు. ‘రామోజీరావు గారి మరణం సినీ, పాత్రికేయ రంగానికి తీరనిలోటు. ఉషాకిరణ్‌లో పని చేసిన నాటి రోజుల నుంచి ప్రతి ఇంట నవ్వులు పూయించిన జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నా. వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. Rip Sir’ అని ట్వీట్ చేశారు.

విశాఖ ఆర్.కె బీచ్‌లో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. నలుపురంగు టీషర్ట్ వేసుకొని.. చేతిపై జైశ్రీరాం అని పచ్చబొట్టు ఉందని మహారాణిపేట ఎస్.ఐ లక్ష్మీ తెలిపారు. ముఖంపై గాయాలను గుర్తించామని వెల్లడించారు. మృతుని వివరాలు తెలిసినవారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 94407 96010, 83310 41628 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

ఈనాడు గ్రూప్ అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా.రామోజీరావు మృతిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం జీవిస్తుంది. లెజెండరీ రామోజీరావు కన్నుమూశారు. ఆయనను కలవడం గొప్ప గౌరవం’ అని కలెక్టర్ రాసుకొచ్చారు. గతంలో రామోజీరావును తన భర్త రవితేజతో కలిసిన ఓ ఫోటోను కలెక్టర్ సృజన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణరాజు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 నెలల క్రితం ఆయనతో కలిసి 2 గంటల పాటు మాట్లాడిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తొస్తున్నాయని అన్నారు. గొప్ప పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కోటికి ఒక్కరిలోనే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.