India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వెట్టి చాకిరి నిర్మూలన చట్టానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వెట్టి చాకిరి వంటి అమానుషమైన ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన వెట్టి చాకిరి నిర్మూలన చట్టము- 1976 అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 09 తేదీని వెట్టి చాకిరి నిర్మూలన దినంగా పాటించబడిందన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మ్‌ర్డ్ రిజర్వు సిబ్బందికి CPR శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోల్డెన్ అవర్స్‌లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. సీపీఆర్ ఎప్పుడు, ఎలా, ఎంతసేపు చేయాలో పూర్తి అవగాహన అవసరమని స్పష్టం చేశారు. డా. రామారావు మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టును గుర్తించి సకాలంలో సీపీఆర్ చేస్తే గుండె మళ్లీ పనిచేస్తుందన్నారు.

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పరిపాలనపై సోమవారం కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు నుంచి ఎస్పీ వకుల్ జిందాల్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జాయింట్ కలెక్టర్ అషుతోశ్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు. మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం పలు అంశాలపై చర్చించారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు తణుకు కోర్టు భారీ జరిమానా విధించింది. పెనుమంట్ర పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి గుత్తుల వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ‘ట్రీస్కేప్స్2026’ అంతర్జాతీయ సదస్సులో ANUబృందం పాల్గొంది. ‘సౌత్ ఏషియన్ ఆగ్రోఫారెస్టీ&ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్ట్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ANU అధ్యాపకులు మనోజ్ రెడ్డి, తన్విక, విద్యార్థుల బృందం హాజరైంది. అటవీసంరక్షణ, వ్యవసాయ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతిక మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి చర్చలు జరిపారు.

జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా బాధితులకు విముక్తి కలిగించాలన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

APలోని 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం వివిధ అంశాల ప్రాతిపదికన ర్యాంకులు కేటాయించింది. ఇందులో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు(77), కందుకూరు(78), కొండపి(79) మార్కులతో రాష్ట్రంలోనే చివరి స్థానానికి పడిపోయాయి. మొత్తంగా 21 నియోజకవర్గాలకు A-ప్లస్, 153 నియోజకవర్గాలకు A-గ్రేడ్ లభించగా, ఒక నియోజకవర్గం B-గ్రేడ్‌లో నిలిచింది. 13 నియోజకవర్గాలు 90% పైగా స్కోరు సాధించాయి.

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కుప్పం నియోజకవర్గంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు (20 ఏళ్ల లోపు గర్భం దాల్చడం) ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.8% టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఉండగా అందులో అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుప్పం తర్వాత నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12 శాతం కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు ఉన్నాయి.

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పోస్టర్ ను కలెక్టరేట్‌లో సోమవారం తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. అన్నీ అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.