Andhra Pradesh

News December 30, 2025

నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

image

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.

News December 30, 2025

2025: కడప జిల్లాలో పెరిగిన మృతుల సంఖ్య

image

కడప జిల్లాలో 2025 సంవత్సరంలో 699 ఘోర, సాధారణ రోడ్డు ప్రమాద కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 351 మంది మృతి. 781 మంది గాయపడ్డారు. 2024లో 633 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా.. 316 మంది మృతిచెందారు. 716 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయని ఎస్పీ పేర్కొన్నారు.

News December 30, 2025

VZM: ‘కూటమి విద్య, వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది’

image

కూటమి ప్రభుత్వం నేడు విద్య, వైద్య విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే నేడు కూటమి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారన్నారు. కొత్తగా జిల్లాకు ఏదైనా పరిశ్రమని తీసుకొని వచ్చారా? అని ప్రశ్నించారు.

News December 30, 2025

నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

image

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.

News December 30, 2025

ప్రజల కోసమే పోలీసుల‌ సేవలు: ఎస్పీ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అధికారులను మంగళవారం సన్మానించారు. ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఎస్పీ డి. నరసింహ కిశోర్ హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఎస్సై డి. సత్యనారాయణ, ఎస్సై జి. రామకృష్ణ పరమహంస, ఎఎస్సై కే. జయలక్ష్మి, ఎఆర్ఎస్ఐ ఎం.రాధాకృష్ణలను ఎస్పీ సన్మానించారు. పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సర్వీసులో వారు అందించిన సేవలను కొనియాడారు.

News December 30, 2025

భీమవరం: ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

భీమవరం పట్టణంలోని పీపీ రోడ్డులో గల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు వేసిన సీళ్లను, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, రిజిస్టర్లలో సంతకాలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News December 30, 2025

పాలకొల్లు ఉపాధ్యాయునికి ‘గురు చైతన్య’ పురస్కారం

image

పాలకొల్లు: పట్టణంలోని జీవీఎస్వీఆర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని జి.నందిని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లాకు ఏడుగురు చొప్పున ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

News December 30, 2025

నెల్లూరు: ఆ ఘనత మనకే..!

image

గూడూరు, రాపూరు, సైదాపురం మండలాలను విలీనం చేయడం నెల్లూరు జిల్లాకు అనుకూలం. ఈ 3 మండలాల్లో అపారమైన ఖనిజ సంపద నెలకొని ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మైకా(అభ్రకం ) గనులు ఉన్న జిల్లాగా నెల్లూరుకు ఉన్న పేరు మరలా వచ్చింది. దీంతోపాటు క్వార్ట్జ్, తెల్లరాయి, గ్రావెల్ ఎక్కువగా ఉన్న సైదాపురం, రాపూరు మనకు రావడంతో జిల్లాకు ఆదాయం చేకూరనుంది.

News December 30, 2025

చిత్తూరు: క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన యువకుడు

image

గుంటూరులో జరుగుతున్న ఎలైట్ అండర్-19 క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లా వి.కోట విద్యార్థి కార్తీక్ అదరగొట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న అతను సెమి ఫైనల్లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ క్రికెట్ అకాడమీ జట్టుపై చెలరేగి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన కార్తీక్ 7 ఫోన్లు 3 సిక్సర్లతో 82 బంతుల్లోనే 96 రన్స్ చేశాడు. తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. బుధవారం తుది పోరు జరగనుంది.

News December 30, 2025

ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

image

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.