Andhra Pradesh

News June 8, 2024

విజయనగరం : ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరిక్ష

image

బిఈడి ప్రవేశాలకు సంబందించిన ఎడ్ సెట్-2024 ప్రవేశ పరిక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 90% మంది విద్యార్థులు హాజరయ్యారని అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస మోహన్ తెలిపారు. ఈ పరీక్షకు MVGR కళాశాలలో 120 మందికి 103 మంది విద్యార్థులు, సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి 131 మంది విద్యార్థులు, ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 500 మందికి 454 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేసారు.

News June 8, 2024

నంద్యాల జిల్లాలోని మండలాలలో వర్షపాతం వివరాలు

image

నంద్యాల జిల్లాలో 16 మండలాలలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 65.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గోస్పాడు 46.2మి.మీ పాణ్యం 44.6, బండి ఆత్మకూరు 42.6, ఉయ్యాలవాడ 42.4, దొర్నిపాడు 42.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా గడివేముల 3.4 మిమీ, డోన్ 0.8 వర్షపాతం నమోదైంది.

News June 8, 2024

ఉరవకొండ: ఏటీఎం ధ్వంసం చేసి.. నగదు చోరీ

image

కూడేరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి దానిలోని నగదును అపహరించారు. ఎంత మొత్తంలో నగదు అపహరించారో తెలియడం లేదు. స్టేట్ బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News June 8, 2024

విశాఖతో రామోజీరావుకి విడదీయరాని అనుబంధం

image

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. పత్రికా రంగంలో కొత్త ఒరవడలు సృష్టించిన ఈనాడు దినపత్రిక విశాఖ నుంచే ఆయన ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ పత్రిక అపూర్వ ప్రజాధరణ పొందింది. అదేవిధంగా నగరంలో డాల్ఫిన్ హోటల్‌ను ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ ఆ డాల్ఫిన్ హోటల్‌కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.

News June 8, 2024

రామోజీ మరణం తీరని లోటు: రోజా

image

రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని మాజీ మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు. ‘రామోజీరావు గారి మరణం సినీ, పాత్రికేయ రంగానికి తీరనిలోటు. ఉషాకిరణ్‌లో పని చేసిన నాటి రోజుల నుంచి ప్రతి ఇంట నవ్వులు పూయించిన జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నా. వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. Rip Sir’ అని ట్వీట్ చేశారు.

News June 8, 2024

విశాఖ బీచ్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం

image

విశాఖ ఆర్.కె బీచ్‌లో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. నలుపురంగు టీషర్ట్ వేసుకొని.. చేతిపై జైశ్రీరాం అని పచ్చబొట్టు ఉందని మహారాణిపేట ఎస్.ఐ లక్ష్మీ తెలిపారు. ముఖంపై గాయాలను గుర్తించామని వెల్లడించారు. మృతుని వివరాలు తెలిసినవారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 94407 96010, 83310 41628 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

News June 8, 2024

అక్షర యోధుడు అస్తమించారు: కలెక్టర్ సృజన

image

ఈనాడు గ్రూప్ అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా.రామోజీరావు మృతిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం జీవిస్తుంది. లెజెండరీ రామోజీరావు కన్నుమూశారు. ఆయనను కలవడం గొప్ప గౌరవం’ అని కలెక్టర్ రాసుకొచ్చారు. గతంలో రామోజీరావును తన భర్త రవితేజతో కలిసిన ఓ ఫోటోను కలెక్టర్ సృజన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

News June 8, 2024

రామోజీరావుతో మాటలు గుర్తొస్తున్నాయ్: RRR

image

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణరాజు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 నెలల క్రితం ఆయనతో కలిసి 2 గంటల పాటు మాట్లాడిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తొస్తున్నాయని అన్నారు. గొప్ప పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కోటికి ఒక్కరిలోనే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

News June 8, 2024

శ్రీకాకుళం: అందుబాటులోకి పోలీస్ సేవ వాహన యాప్

image

పోలీస్ సేవా యాప్ కొన్నిరోజులుగా పనిచేయకపోవడంతో దాని స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రం ఈ యాప్ తెచ్చింది. ప్రస్తుతం దీని ద్వారానే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. వాహన బీమా సొల్యూషన్, కేసులు గత బకాయిలు దీనిలోనే తెలుస్తాయి. కొత్త యాప్‌లోనే అపరాధ రుసుం విధిస్తున్నట్లు శ్రీకాకుళం నగర ట్రాఫిక్ ఎస్సై వి.సందీప్ చెప్పారు.

News June 8, 2024

కురబలకోట: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్‌లో సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాషా కథనం మేరకు.. అర్ధరాత్రి కురబలకోట రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.