India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోశయ్య బరిలో నిలవగా.. పెమ్మసాని 2,82,085 ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA ఎమ్మెల్యే అభ్యర్థుల(857213) కంటే.. ఎంపీ అభ్యర్థికి(864948) ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మంగళగిరిలో రెండింటి మధ్య 4775 ఓట్ల వ్యత్యాసం కనిపించింది.

పాత్రికేయ రంగంలో చెరగని ముద్రవేసిన ఈనాడు అధినేత రామోజీరావు మరణవార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి సంతాపం ప్రకటించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సినీరంగంలో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీ రావు అని.. ఆయన లేరన్న వార్త తెలుగుజాతిని శోకసంద్రంలో ముంచి వేసిందన్నారు.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డు-2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి కరుణ కుమారి తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవలు, ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీసెస్, ట్రేడ్, ఇండస్ట్రీ రంగాల్లో ఉత్తమ సేవలు చేసి ఉండాలన్నారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

గుంతకల్లు: సెంట్రల్ రైల్వేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బిలాస్‌పూర్ నుంచి యలహంక వెళ్లే ఎక్స్‌పైస్ ప్రత్యేక రైలు (08291)ను ఈనెల 15, 18, 22, 25, 29 జలై 1, 4, 8 తేదీల్లోనూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 08292)ను ఈనెల 17, 20, 24, 27 జలై 1, 4, 8 తేదీల్లోనూ రద్దు చేస్తునట్లు తెలిపారు

రామోజీ సంస్థల అధినేత, ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు ఆకస్మిక మరణం పత్రికా రంగానికి తీరని లోటని తెలుగు బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మీడియాతో పాటు వివిధ రంగాల్లో రామోజీ సేవలు మరువలేనివి అని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు మినహా మిగిలిన చోట్ల కూటమి విజయం సాధించింది. TDP నుంచి గంటా, అయ్యన్న, బండారు వంటి మాజీ మంత్రులు ఉన్నారు. మహిళా కోటాలో అనిత ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పల్లాతోపాటు ఎక్కసార్లు గెలిచిన వెలగపూడి, గణబాబు కూడా TDP అభ్యర్థులే. జనసేనలో మాజీ మంత్రి కొణతాలతో పాటు పంచకర్ల, మొదటిసారి గెలిచిన సుందరపు, వంశీ ఉన్నారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్‌కు ఇది రెండో విజయం.

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మరికొద్ది సేపట్‌లో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 52 ఆన్‌లైన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షకు 10,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ ఆచార్య టీవీ కృష్ణ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఆయన తెలిపారు.

పలాస మండలం లక్ష్మీపురం YCP ఎంపీటీసీ గోండు మోహన్, ఆయన భార్య, మేనల్లుడు సురేష్ పై శుక్రవారం TDP కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. ఇంటికి వెళ్లి ముగ్గురిపై ఆయుధాలతో దాడి చేశారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఇలాంటి భౌతిక దాడులు సరైన పద్ధతి కాదని, ప్రజలు అధికారం కట్టబెట్టింది దాడులు చేయడానికి కాదని హితవు పలికారు.

ఎమ్మిగనూరులో తండ్రీకొడుకులు ఆరుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వరుసగా 1985 నుంచి1999 వరకు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై రెండోసారి గెలిచి టీడీపీ జెండా ఎగరవేశారు.

భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడిన ఘటన చినగంజాం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన కత్తి శ్రీనివాసరావు తన భార్య దుర్గపై అనుమానంతో తరచూ గొడవలు పడేవాడు. ఈనేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను అక్కడికి వెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.