India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కదిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మార్చి 19న అంకురార్పణం ఉత్సవం, 20న కళ్యాణోత్సవం, 21న హంస వాహనం, 22న సింహ వాహనం, 23న హనుమంత వాహనం, 24న బ్రహ్మ గరుడ సేవ, 25న శేష వాహనం జరగనున్నాయి. ఇది తమిళనాడులోని ఆండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథోత్సవం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథోత్సవం తర్వాత మూడో అతి పెద్ద బ్రహ్మ రథోత్సవం కానున్నది.
ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో శనివారం రాత్రి కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
విజయనగరం నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడంపై నిర్ణయం తీసుకుంటామని వైసీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు.ఆదివారం అంబటి సత్రంలో ఆయన మాట్లాడారు.ఉత్తరాంధ్రలో వైసీపీ యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, జిల్లాకు సంబంధించి ఒక్క పార్టీకూడా తమ వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా..టికెట్ ఇవ్వలేదని, వైసీపీ మోసం చేసిందన్నారు.
ఆదోని ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకే కేటాయించాలని ఆదోని జిల్లా సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. టీడీపీని గెలిపించుకుని ఆదోనిలో ఆగిపోయిన అభివృద్ధిని మరలా కొనసాగించాలన్నారు. ఆదోని టికెట్టు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించరనే వార్తలు ప్రజలకు నిరాశ కలిగిస్తున్నాయన్నారు. చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు.
అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
మండలంలోని పొట్లూరులో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా ఉండేందుకు కొందరు విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు(53) శనివారం రాత్రి తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా కాలికి కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సీతంపేట మండలం కడగండి గ్రామ యువకుడు పాలక కళ్యాణ్, మరో ఇద్దరు 15వ తేదీ ఇంటర్ పరీక్ష రాసి అనంతరం స్నేహితుని రూమ్‌లో ఉండి.. ఆదివారం భామిని నుంచి ఇంటికి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. స్థానికులు వెంటనే 108లో శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకువెళ్లారు. మార్గమధ్యలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బందోబస్తు నిర్వహణకు 216 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థులు కేంద్రాలకు వచ్చి వెళ్లటానికి ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. 216 మంది ఏఎన్ఎంలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పదో తరగతి విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ కేటగిరి సెంటర్లు 62 కాగా పోలీస్ స్టేషన్ దగ్గరగా, పోలీస్ స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీ సెంటర్లు 57, పోలీస్ స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైగా ఉన్న సెంటర్లో 15 ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
విశాఖ జిల్లాలో నేటి నుంచి ఓపెన్ స్కూల్ లో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి 5: 30 గంటల వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతికి 986 మంది, ఇంటర్ కు 1215 మంది విద్యార్థులు హాజరవుతారని డీఈవో చంద్రకళ తెలిపారు. వీరి కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.