India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పలాస మండలం లక్ష్మీపురం YCP ఎంపీటీసీ గోండు మోహన్, ఆయన భార్య, మేనల్లుడు సురేష్ పై శుక్రవారం TDP కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. ఇంటికి వెళ్లి ముగ్గురిపై ఆయుధాలతో దాడి చేశారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఇలాంటి భౌతిక దాడులు సరైన పద్ధతి కాదని, ప్రజలు అధికారం కట్టబెట్టింది దాడులు చేయడానికి కాదని హితవు పలికారు.

ఎమ్మిగనూరులో తండ్రీకొడుకులు ఆరుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వరుసగా 1985 నుంచి1999 వరకు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై రెండోసారి గెలిచి టీడీపీ జెండా ఎగరవేశారు.

భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడిన ఘటన చినగంజాం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన కత్తి శ్రీనివాసరావు తన భార్య దుర్గపై అనుమానంతో తరచూ గొడవలు పడేవాడు. ఈనేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను అక్కడికి వెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. చిత్తూరు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి రేసులో పులివర్తి నాని, గాలి బానుప్రకాశ్, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉన్నట్లు అలికిడి వినిపిస్తోంది.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-ఔరంగాబాద్- గుంటూరు మధ్య రైలును ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ద.మ. రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఔరంగాబాద్ 13.20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17254) ఔరంగాబాద్‌లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటి రోజు 21.30 గంటలకు చేరుతుంది.

వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ను ప్రజా ప్రతినిధులు కలవాలంటే సీఎంఓ దూరం పెట్టిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ధర్మవరంలో రైల్వే ఉపరిత వంతెన నిర్మాణ భూసేకరణకు రూ.15 నుంచి 20 కోట్లు మంజూరు కోసం సీఎం కార్యాలయం చూట్టూ, గుంతలు పడిన రోడ్ల నిధుల కోసం ఫైనాన్స్ సెక్రటరీ వద్దకు యాభైసార్లు తిరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మేనిఫెస్టో మీద నమ్మకం పెట్టుకున్నారన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధిక స్థానాలు రావడంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. శ్రీకాకుళం ప్రతినిధి కేంద్ర కేబినెట్లో టీడీపీ వాటా కింద రాష్ట్ర ఎంపీలో రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి రావచ్చని టీడీపీ నాయకులు ఆశిస్తున్నాను. శ్రీకాకుళం ఎంపీగా మూడుసార్లు గెలుపొందారు. వాజ్ పేయీ హయాంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు.

సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.

సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.

4 దశాబ్దాలుగా రాజంపేటలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ఆపార్టీ అధికారంలోకి వస్తోంది. కానీ 2024 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ మారింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి విజయం సాధించగా.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి అమర్ నాథ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆకేపాటి ప్రతిపక్షానికి పరిమితం అవుతున్నారు.
Sorry, no posts matched your criteria.