Andhra Pradesh

News June 8, 2024

అనకాపల్లిలో 40 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన బీజేపీ

image

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో 40 ఏళ్ల రికార్డును BJP బ్రేక్ చేసింది. 1962లో జరిగిన పునర్విభజనలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ కేంద్రమయ్యింది. అప్పటినుంచి 2019వ రకు టీడీపీ ఎంపీ పి.అప్పల నరసింహం మెజారిటీ రికార్డుగా ఉండేది. ఆయన సాధించిన 1.74 లక్షల ఓట్ల మెజార్టీని 40 ఏళ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అధిగమించారు. వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడుపై 2.96 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

News June 8, 2024

టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి?

image

కడప ఎంపీ స్థానానికి కూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డికి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. దీంతో టీడీపీ బోర్డు ఛైర్మన్‌కు భూపేశ్ అర్హుడని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దీనిపై భూపేశ్ స్పందన తెలియాల్సి ఉంది.

News June 8, 2024

చిత్తూరు: కరెంటు షాక్ కొట్టి చిన్నారికి తీవ్రగాయాలు

image

కరెంటు షాక్ కొట్టి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగింది. రెడ్డిస్ కాలనీకి చెందిన లలిత్ ఆదిత్య (10) ఇంటి మిద్దెపై కమ్మితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే వెళ్తున్న విద్యుత్తు లైనుకు తగిలించాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన బాలుడిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేశారు.

News June 8, 2024

అనంత: ఎమ్మెల్యేలకు కలిసొచ్చిన ‘S‘ అక్షరం

image

అనంతపురం జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. కాగా వారి అందరి పేర్లు ‘S’ అక్షరంతో మెుదలవడం విశేషంగా చెప్పవచ్చు. రాప్తాడు నియోజకవర్గం నుంచి సునీత, పెనుకొండ నుంచి సవిత, శింగనమల నుంచి శ్రావణిశ్రీ, పుట్టపర్తి నుంచి సింధూర రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వీరిలో పెనుకొండ నుంచి సవిత 33వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

News June 8, 2024

మద్దికేర: ఒక్కరోజు ఎస్సైగా మాత్రమే విధులు

image

మద్దికేర పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామిరెడ్డి ఎస్ఐగా పదోన్నతి పొంది ఒక్క రోజు మాత్రమే పని చేశాడు. 31వ తేదీన జిల్లా ఉన్నతాధికారులు ఎస్ఐగా పదోన్నతి ఇచ్చారు. అదే రోజు పదవి విరమణ చేశారు. అయితే ఎక్కడ కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో మద్దికెర స్టేషన్‌లోనే పదవి విరమణ పొందారు. డి. ఎస్. పి సీఐ ఎస్ఐలు తోపాటు, సిబ్బంది బంధుమిత్రులు ఆయనను సత్కరించడం జరిగింది.

News June 8, 2024

CTR: ITIలో ప్రవేశాలకు ఎల్లుండే చివరి తేదీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీతో ముగుస్తుందని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులని సూచించారు. ఆసక్తి కలిగిన వారు www.iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు తప్పనిసరిగా వెరిఫికేషన్ చేసుకోవాలని అన్నారు.

News June 8, 2024

ఏనుగులు ఎటాక్.. చాకచక్యంగా వ్యవహరించిన రైతు 

image

కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల బెడద రోజురోజుకు పెరుగుపోతుంది. జియ్యమ్మవలస మండలం గౌరీపురం వద్ద ఎడ్లబండితో వెళ్తున్న రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పెదకుదమ గ్రామానికి చెందిన బోను తిరుపతిరావు శుక్రవారం ఇసుక కోసం నాటుబండిపై వెళ్తుండగా ఏనుగులు ఎటాక్ చేశాయి. చాకచక్యంగా వ్యహరించిన రైతు ఎడ్లు తాలు విప్పి వాటిని తోలేసి.. తానూ ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా.. ఏనుగులు నాటుబండిని ధ్వంసం చేశాయి.

News June 8, 2024

ప.గో.: గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 2024- 25 విద్యాసంవత్సరానికి గాను 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 20న నరసాపురం గురుకులంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీ, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 8, 2024

ఆలూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు

image

సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన విరూపాక్షి, ఆలూరు మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ IAS ఆఫీసర్ బర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

News June 8, 2024

గుడివాడలో డిగ్రీ వరకు చదివిన రామోజీరావు

image

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు గుడివాడలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అని పేరు పెట్టగా.. పాఠశాలలో తన పేరు రామోజీరావు అని చెప్పి పరిచయం చేసుకున్నారు. ఇలా తన పేరును తానే పెట్టుకున్నారు. ఈ తెల్లవారుజామున రామోజీ మరణంతో కృష్ణా జిల్లాలోని ఆయన సన్నిహితులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.