Andhra Pradesh

News June 8, 2024

విశాఖ నుంచే ఈనాడు ప్రస్థానం

image

రామోజీ సంస్థల పేరుతో అనేక వ్యాపారాలు చేసిన రామోజీరావుకు ఈనాడు ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. 1974 ఆగస్టు 10న విశాఖలో సీతమ్మధార సమీపంలోని నక్కవానిపాలెం ఈనాడు ఆఫీసును ప్రారంభించారు. మొదట 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. అప్పట్లో చాలా పత్రికల పేర్లు ఆంధ్ర పదంలో మొదలయ్యేవి. దానికి భిన్నంగా అచ్చమైన తెలుగు పదంతో ప్రారంభించిన ఈనాడుకి ఈ ఆగస్టు 10కి యాభై ఏళ్లు. ఆ పండగ చూడకుండానే రామోజీ కన్నుమూశారు.

News June 8, 2024

ప్రకాశం: ఆ స్థానాల్లో టీడీపీ, వైసీపీలకు గెలుపు అందని ద్రాక్ష

image

ప్రకాశం జిల్లాలోని పర్చూరు, చీరాలలో వైసీపీ, వైపాలెంలో టీడీపీ ఇంతవరకు ఖాతాలు తెరవలేదు. 2009లో డీలిమిటేషన్‌లో కొత్తగా వైపాలెం నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఒకసారి, మూడుసార్లు వైసీపీ గెలిచింది. అలాగే చీరాలలో వైసీపీ వచ్చాక జరిగిన మూడు ఎన్నికలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. ఇక పర్చూరులోనూ వైసీపీకి ఆశాభంగమే ఎదురైంది.

News June 8, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముస్తాబాద్-గన్నవరం రైల్వే సెక్షన్ మధ్య ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ శుక్రవారం నుంచి జూన్ 29 వరకు విజయవాడ-ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందన్నారు. జూన్ 29 వరకు ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News June 8, 2024

శ్రీసత్యసాయి: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

image

కొత్తచెరువు మండలంలోని నారాయణపురం రైల్వేస్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రైల్వే హెచ్‌సి ఎర్రిస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో శరీరం నుంచి తల వేరైందని తెలిపారు. 30 ఏళ్ల యువకుడు నీలం రంగు ప్యాంటు, సిమెంటు కలర్ టీషర్టు, నల్లని బూట్లు ధరించాడని తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు.

News June 8, 2024

కడప: ఒకే ఒక్క ఎమ్మెల్యే

image

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో YCP గెలిచిన 11 స్థానాల్లో బద్వేల్ MLA దాసరి సుధ ఓ రికార్డు నమోదుచేశారు. YCP నుంచి గెలిచిన ఒకే ఒక్క మహిళా MLAగా నిలిచారు. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఏకైక మహిళా MLAగా కూడా నిలిచారు. అయితే 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో 90,533 భారీ మెజార్టీతో గెలిచిన ఆమె.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 18,567 మెజార్టీ ఓట్లకు తగ్గిపోయారు.

News June 8, 2024

మారిన చిత్తూరు సెంటిమెంట్

image

2009 సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయపరంగా చిత్తూరు నియోజకవర్గ సెంటిమెంట్ మారింది. 2004 వరకు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 2009 నుంచి చిత్తూరు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంప్రదాయం వచ్చింది. అయితే 2009, 2014, 2019 అక్కడ గెలిచిన పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2024 ఎన్నికలో గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

News June 8, 2024

చిత్తూరు: 31 మండలాల్లో వర్షం

image

రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని 31 మండలాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పాలసముద్రం మండలంలో 73.4 మి.మీ., పలమనేరు 71.2, బైరెడ్డిపల్లె 67.2, గంగవరం 57.8, తవణంపల్లె 57.2, రామకుప్పం 38.2, వి.కోట 36, చిత్తూరు టౌన్ 33.4, కుప్పం 29, పూతలపట్టు 28. 6, చౌడేపల్లె 28.4, గుడుపల్లె 27.6, జీడీ నెల్లూరు 27.2, ఐరాల 26.2 మి.మీ నమోదైంది. జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

News June 8, 2024

భావనగర్- కాకినాడ పోర్ట్ రైలు దారి మళ్లింపు

image

భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

News June 8, 2024

భావనగర్- కాకినాడ పోర్ట్ రైలు దారి మళ్లింపు

image

భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

News June 8, 2024

సోమిరెడ్డికి మంత్రి పదవి?

image

నెల్లూరు జిల్లా TDP సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లిలో 2 దశాబ్దాల తర్వాత సోమిరెడ్డి TDP జెండా ఎగురవేశారు. నారా లోకేశ్‌ను ఆయన నిన్న ప్రత్యేకంగా కలవడంతో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత టీడీపీ హయాంలో ఆయన మంత్రి(MLC కోటా)గా చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పదవి దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.