Andhra Pradesh

News April 16, 2024

నందలూరు: సివిల్స్‌లో మెరిసిన కృష్ణ శ్రీవాత్సవ్ యాదవ్

image

నందలూరు మండలానికి చెందిన గొబ్బిళ్ళ కృష్ణ శ్రీవాత్సవ్ ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో 444 ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ శ్రీవాత్సవ్ సోదరి విద్యాధరి కందుకూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఇంట్లో అక్క ఉద్యోగం, తమ్ముడు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

News April 16, 2024

వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ 

image

శ్రీకాకుళం జిల్లాలో వేసవి వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సూచించారు. మంగళవారం ఆయన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతోపాటు వేడిగాలుల ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News April 16, 2024

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

సాధారణ ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల కొరకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ అధికారులు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం-12 దరఖాస్తులు పూర్తి చేసి 24, 25 తేదీలలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News April 16, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల

image

తిరుపతి: శ్రీవేంకటేశ్వర దూరవిద్య(DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ (PG) ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 16, 2024

అన్నమయ్య: 120 కేంద్రాల్లో స్లాష్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో స్లాష్ 2024 పరీక్షలు 120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని డీసీఈబీ సెక్రటరీ కె నాగమునిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన అన్ని కేంద్రాలలో స్లాష్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏ కేంద్రానికి మినహాయింపు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

News April 16, 2024

నిరుద్యోగ రహిత నెల్లూరు నా లక్ష్యం – విజయసాయిరెడ్డి

image

నిరుద్యోగ రహిత నెల్లూరు నా లక్ష్యమని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు రామ్మూర్తి నగర్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారంలో ఒకసారి ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తామని అన్నారు.

News April 16, 2024

ధర్మవరంలో హత్య.. నిందితులు అరెస్ట్

image

ధర్మవరం పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ గంటల వ్యవధిలోని అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న శ్రీనివాసరెడ్డిని ఆటో నడుపుతున్న లోకేంద్ర, విష్ణు అనే వ్యక్తులు కిరాయి విషయంలో గొడవపడి కట్టెలతో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. సీఐ మంగళవారం సాయంత్రం నిందితులను అరెస్టు చేశారు.

News April 16, 2024

వాహన తనిఖీలు.. రూ.6 లక్షలు సీజ్: ఆర్డీవో

image

పెద్దాపురం మెయిన్ రోడ్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.6 లక్షల నగదు పట్టుబడినట్లు ఆర్డీవో సీతారామారావు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకట రాజగుప్తా పెద్దాపురం మెయిన్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. కాండ్రకోటకు చెందిన పల్లికల శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి వద్ద ఎటువంటి పత్రాలు లేకుండా రూ.6లక్షల నగదు పట్టుబడిందని అన్నారు.

News April 16, 2024

కోడ్ అమలుకు పటిష్ట చర్యలు: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మల్లిఖార్జున పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలు, ప్రచారం, ఓటర్ల నమోదు, నామినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు.

News April 16, 2024

ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం: పల్నాడు కలెక్టర్

image

ఈనెల 18 నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరిస్తున్నట్లు పల్నాడు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. నామినేషన్ల గడువు 25తో ముగుస్తుందన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అన్నారు. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు.