Andhra Pradesh

News April 16, 2024

కృష్ణా జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఇవే..

image

ఈ నెల 18 నుంచి అభ్యర్థులు ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
* మచిలీపట్నం MP నామినేషన్లు : కలెక్టరేట్
* మచిలీపట్నం MLA : తహశీల్దార్ ఆఫీస్
* అవనిగడ్డ MLA : తహశీల్దార్ ఆఫీస్
* పెడన MLA : తహశీల్దార్ ఆఫీస్
* పామర్రు MLA : తహశీల్దార్ ఆఫీస్
* గుడివాడ MLA : తహశీల్దార్ ఆఫీస్
* గన్నవరం MLA : తహశీల్దార్ ఆఫీస్
* పెనమలూరు MLA : తహశీల్దార్ ఆఫీస్

News April 16, 2024

సూళ్లూరుపేటలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

తిరుపతి జిల్లాలో ఇవాళ నమోదైన ఉష్ణోగ్రత వివరాలను రాష్ట్ర విపత్తుల శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 42.4 నమోదు అవ్వగా గూడూరు, చిల్లకూరు మండలాల్లో 41.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నాయిడుపేటలో 41.1 డిగ్రీలు నమోదు అయ్యాయి. మరో నాలుగు రోజులు ఇదే రీతిలో నమోదు కానున్నట్లు పేర్కొంది.

News April 16, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించాలని వినతి

image

గంగవరం అదాని పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గత వారం రోజుల నుంచి కోల్ కోక్ సరఫరాను నిలిపివేసిందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల స్టీల్ ప్లాంట్ కు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

News April 16, 2024

శ్రీకాకుళం: యూపీఎస్సీలో వెంకటేష్‌కు 467 ర్యాంక్

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ యూపీఎస్సీ ఫలితాలలో 467 ర్యాంకు సాధించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలిపారు. మారుమూల గ్రామం నుంచి 467వ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మన్మధరావు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News April 16, 2024

టీడీపీలో చేరిన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు 

image

ప్రముఖ పారిశ్రామికవేత్త కొణతాల రఘునాథ్ మంగళవారం టీడీపీలో చేరారు. రఘునాథన్‌కు చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి కొణతాల రామకృష్ణ సోదరుడైన రఘునాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానికంగా చర్చనీయాశం అయ్యింది. 2014లో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్ పోటీ చేశారు.

News April 16, 2024

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పీవీ సింధు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరి యాదవ్, సీఎస్ఓ నాగభూషణం వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు.

News April 16, 2024

సైబర్ మోసాలు.. పుస్తకాన్ని ఆవిష్కరించిన విశాఖ పోలీసులు

image

ప్రజలు సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మాట్లాడుతూ.. సైబర్ మోసాలు నివారణపై తెలుగు ఇంగ్లీష్‌లో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొరియర్ ద్వారా పార్సిల్ వచ్చిందని ఆగంతకులు ఫోన్ చేస్తే నమ్మవద్దని అన్నారు. మోసానికి ఎవరైనా గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News April 16, 2024

ప్రకాశం జిల్లాలో ఓటు నమోదుకు 8,320 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లాలో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ క్రమంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి ఓటు హక్కు నమోదు కోసం 8,320 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి సంబంధిత బిఎల్ఓ‌లకు పంపారు. వారం రోజుల్లో ఓటు హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి అర్హత ఉంటే ఓటు హక్కు కల్పించనున్నారు.

News April 16, 2024

అనంత: యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

image

కడప యోగివేమన యూనివర్సిటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.
కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్‌కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2024

పాడేరు: ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ధరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. అరకు, పాడేరు, చింతపల్లి, విశాఖపట్నంలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకున్న 4,733 విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.