India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
VZM : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు.
యోగివేమన యూనివర్సిటీలో సుల్తానా అనే విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్‌కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గొండు శంకర్‌తో కలిసి పనిచేయమని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు తేల్చేశారు. మంగళవారం శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ భేటీ పలాసలో జరిగింది. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబుతో శ్రీకాకుళం సీటుపై చర్చలు జరిపారు. తమకు కానీ లేదా వేరొకరికి టికెట్ ఇచ్చినా సమ్మతమే అన్నారు. వేరొకరికి ఇచ్చినా మద్దతు ఇచ్చి పనిచేస్తాం కానీ, రెండున్నరేళ్లుగా అసమ్మతి రాజేసిన గొండు శంకర్‌తో కలిసి పని చేయలేమని వెనుదిరిగారు.
కర్నూలు జిల్లా బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఆదోనికి చెందిన రమేశ్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి తమను నిర్లక్ష్యం చేయడంతో బీజేపీకి వీడ్కోలు పలికానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇస్తే ఆదోని నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల అండ తనకు ఉందని పేర్కొన్నారు.
ఆలోచించి ఓటు వేయకపోతే మీ జీవితాలను ఇతరులకు రాసిచ్చినట్లేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం పీలేరు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారారన్నారు. పీలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
సివిల్స్ ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన దొనక పృథ్వీరాజ్ 493వ ర్యాంకు సాధించారు. తండ్రి దొనక విజయ్ కుమార్ కురుపాం MEOగా, తల్లి రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. పృథ్వీరాజ్ తన రెండవ ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చదివిన యువకుడు.. ఇంటి వద్దే సివిల్స్‌కు సన్నద్ధం అయ్యి ర్యాంకు సాధించారు. ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎల్లుండి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎవరు, ఎక్కడ నామినేషన్ వేయాలో తెలుసా..?
➤ చిత్తూరు MP: చిత్తూరు కలెక్టర్ ఆఫీసు
➤ పుంగనూరు MLA: పుంగనూరు MRO ఆఫీసు
➤ నగరి MLA: నగరి MRO ఆఫీసు
➤ GDనెల్లూరు MLA: జీడీనెల్లూరు MRO ఆఫీసు
➤ చిత్తూరు MLA: జాయింట్ కలెక్టర్ ఆఫీసు, CTR
➤ పూతలపట్టు MLA: పూతలపట్టు MRO ఆఫీసు
➤ పలమనేరు MLA: పలమనేరు RDO ఆఫీసు
➤ కుప్పం MLA: కుప్పం MRO ఆఫీసు
బ్రహ్మంగారిమఠం మండలంలోని నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో జరిగిన కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బద్వేల్‌కు చెందిన టీవీఎస్ షోరూం నిర్వాహకుడు అంబవరపు జయసుబ్బారెడ్డి(55) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. టిప్పర్ కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న సుబ్బారెడ్డికి తలకు తీవ్ర గాయాలుకావడంతో 108లో కడపకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్ బోల్తా పడి వివాహిత మృతి చెందిన ఘటన ముప్పాళ్ల మండలం తురకపాలెంలో జరిగింది. తురకపాలెం గ్రామానికి చెందిన పలువురు పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో కృపావతి (40) మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాల తరలించి, క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరులో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనపై మంగళవారం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రైల్వే స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్ ఫారంపై వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వివరాలు తెలిసిన వాళ్ళు గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.