Andhra Pradesh

News April 16, 2024

సారవకోటలో 100 మంది వాలంటీర్లు రాజీనామా

image

సారవకోట మండల కేంద్రంలో 100 మంది వాలంటీర్లు మంగళవారం స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం సెక్రటరీ ద్వారా ఎంపీడీవోకి అందజేశారు. తామంతా నిరుపేదలకు ఎన్నో సంక్షేమ , అభివృద్ధి పథకాలు అందించామన్నారు. కానీ కూటమి నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలు బాధించాయన్నారు.

News April 16, 2024

కాకినాడ: విషాదం.. కానిస్టేబుల్ మృతి

image

తూ.గో. జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మిరియాల పెంటారావు (42) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కాకినాడ ఏపీఎస్పీలో పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉంటున్నారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో కాకినాడ GGHకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

News April 16, 2024

నామినేషన్లకు అభ్యర్థుల సన్నాహాలు

image

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు కలెక్టర్ హరినారాయణ్ ప్రకటించారు. మరోవైపు అభ్యర్థులు తమ నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మంచి ముహూర్తం కోసం జ్యోతిష్య పండితులను ఆశ్రయిస్తున్నారు. ప్రధాన అభ్యర్థులందరూ నామినేషన్ పత్రాలను నింపే బాధ్యతను అనుభవం ఉన్న న్యాయవాదులకు అప్పగిస్తున్నారు.

News April 16, 2024

కృష్ణా: ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో జగన్‌పై దాడి

image

ఫుట్ పాత్ కోసం వేసే టైల్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడన్‌గా సీఎం జగన్‍పై సతీశ్ అనే యువకుడు దాడి చేసినట్లు సిట్ అధికారులు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. అతడితో పాటు ఉన్న ఆకాశ్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

News April 16, 2024

పాలకొండ: 200 ఏళ్ల నాటి రామాలయం

image

పాలకొండ రోడ్డులో ఉన్న కోదండ రామాలయం 200 ఏళ్ల కిందట అళ్వార్లు నిర్మించారు. 1826లో అయోధ్య నుంచి నాటు బండ్లపై సీతారామ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కోదండ రామాలయంగా ఉన్న ఈ ప్రదేశంలో అద్దమడుగుల వెంకన్న పంతులు పేదవారికి, అనాథల కోసం అన్నసత్రం ఏర్పాటు చేశారని, ఆయన ఆధ్వర్యంలోనే కోదండ రామాలయం నిర్మించినట్టు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు.

News April 16, 2024

ప.గో.: 18వ తేదీలోపు సస్పెన్స్‌కి తెరపడుతుంది: RRR

image

తాను ఎక్కడ నుండి పోటీ చేస్తానన్న విషయంపై ఈ నెల 18వ తేదీ లోపు స్పష్టత వస్తుందని సస్పెన్స్‌కి తెరపడుతుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయు విషయంపైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి తన నుదుటిన ఏం రాశాడో అంటూ వ్యంగంగా స్పందించారు.

News April 16, 2024

VZM: ఆన్‌లైన్ మోసం.. రూ.14 లక్షలు కోల్పోయిన యువతి

image

తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని వచ్చిన మెసేజ్‌కు యువతి మోసపోయిన ఘటన గజపతినగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పురిటిపెంటకి చెందిన ఓ యువతికి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని మెసేజ్ వచ్చింది. నమ్మిన యువతి దశలో వారీగా రూ.14.15 లక్షలు జమ చేసింది. అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

News April 16, 2024

ప్రకాశం: దొంగలు హల్చల్.. గాయపడ్డ భార్యాభర్తలు

image

జిల్లాలోని అర్దవీడు మండలం మొహిద్దీన్ పురంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలో 2 గంటల సమయంలో గొర్రెల దొంగతనానికి వచ్చి దొంగలు గొర్రెల కాస్తున్న దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో గొర్రెల కాపరికి స్వల్ప గాయాలు కాగా.. భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంగళగిరి హస్పిటల్‌కు తరలించారు

News April 16, 2024

కడప: ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు నుంచి అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అన్ని నియోజకవర్గాల ఆర్‌‌ఓలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 16, 2024

కర్నూలు: ఈనెల 19, 20వ తేదీల్లో షర్మిల పర్యటన

image

‘ఏపీ న్యాయ యాత్ర’లో భాగంగా ఈనెల 19, 20వ తేదీల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 19న అలూరు, ఆదోని, కోసిగిలో, 20న కోడుమూరు, కర్నూలులో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.