Andhra Pradesh

News April 16, 2024

ఏలూరు: సీఎం జగన్ బస్సు యాత్ర షురూ..

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. సోమవారం రాత్రి నారాయణపురంలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

News April 16, 2024

కృష్ణా: ఇటుకల ఫ్యాక్టరీ వద్ద గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

బందరు మండలం తపసిపూడి ఇటుకల ఫ్యాక్టరీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్లు బందరు తాలుకా పోలీస్ స్టేషన్ తెలిపాలని సీఐ శ్రీనివాస్ కోరారు.

News April 16, 2024

చిత్తూరు కలెక్టర్ కీలక సూచన

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జాతర నిర్వహణపై కలెక్టర్ షన్మోహన్ కీలక సూచనలు చేశారు. మే 10 లోపు లేదా మే 15 తర్వాత గంగ జాతరలు చేసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. జాతర నిర్వహణకు పోలీస్ స్టేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయరాదని సూచించారు.

News April 16, 2024

విశాఖ: గంజాయి రవాణా కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ విశాఖ మెట్రోపాలిటీ కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి తీర్పు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ రాహుల్ రజాక్ 2019 ఆగస్టు 26న తన లారీలో 1,015 కిలోల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష విధించారు.

News April 16, 2024

కంచిలి: ట్రైన్ ఢీ కొని వ్యక్తి మృతి

image

సోంపేట హైవే బ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ మృతదేహం చిద్రమవ్వడంతో గుర్తుపట్టే స్థితిలో లేనట్లు తెలుస్తోందన్నారు. కాగా ఇది ప్రమాదమా ..? లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News April 16, 2024

ప.గో.: సీఎం పర్యటన.. 1500 పోలీసులతో బందోబస్తు

image

సీఎం జగన్‌ బస్సుయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశామని ఎస్పీ రజిత తెలిపారు. ఉండి కోట్ల ఫంక్షన్‌ హాల్‌లో యాత్రకు సంబంధించి పోలీసులకు అవగాహన కల్పించారు. పోలీసులు రోడ్డుకు ఇరువైపులా భద్రతా సిబ్బందితో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జిల్లాలోని ఆయా కేటగిరీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం భద్రతకు సుమారు 1500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు.

News April 16, 2024

తూ.గో.: తుప్పల్లో పసికందు.. సంచలన విషయాలు

image

కడియం మండలం వేమగిరికి చెందిన ఓ మహిళ తన బిడ్డను <<13061116>>తుప్పల్లో<<>> పడేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రాగా.. తనకు తానే పురుడు పోసుకుంది. కత్తిపీటతో పేగు తెంచుకొంది. 4వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని పాపను 20అడుగుల ఎత్తునుంచి తుప్పల్లోకి విసిరింది. కాగా తప్పు తెలుసుకొని తిరిగి అక్కున చేర్చుకుంది. రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

News April 16, 2024

ప.గో.: సీఎం సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

image

సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం ఉంగుటూరు మండలం నారాయణపురం రాత్రి బస చేసిన చోట నుండి బయలుదేరి నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటుంది. ఈ సందర్భంగా భీమవరంలో బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గరగపర్రు, పిప్పర, దువ్వ, తణుకు క్రాస్ మీదుగా ఈతకోటలో రాత్రికి సీఎం జగన్ బస చేస్తారు.

News April 16, 2024

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?

image

సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప.గో. జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. కాగా సీఎం జగన్ X (ట్విట్టర్) వేదికగా ‘DAY-16 పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?’ అంటూ పోస్ట్ చేశారు.

News April 16, 2024

వైసీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎస్వీ మోహన్ రెడ్డి

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.