India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మవరం పట్టణం కొత్తపేట రైల్వే స్టేషన్ ఎదురుగా శ్రీనివాస రెడ్డి(58) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
నగరి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లుడు, పుత్తూరు పట్టణ 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జాన్ కెనడీ టీడీపీ గూటికి చేరారు. ఆయనకు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెనడీతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీని వీడారు. కోనేటి ఆదిమూలం కూడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరడం విశేషం.
మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి మురళి, శ్రీవల్లి దంపతుల కుమారుడు కైతేపల్లి షణ్ముఖ వర్ధన్‌ను మాజీ సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసిన షణ్ముఖ వర్ధన్‌ను చంద్రబాబు సత్కరించారు.
మగ సంతానమే కావాలనే ఆలోచనతో ఓ తల్లి మానవత్వం లేకుండా అప్పుడే పుట్టిన పాపను తుప్పల్లో పడేసింది. ఈ ఘటన తూ.గో జిల్లా కడియం మండలం వేమగిరిలో జరిగింది. తాపీ పనులు చేసుకునే ఓ కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగ సంతానం కావాలనే ఆలోచనతో ఉన్న మహిళ కు.ని ఆపరేషన్ చేయించుకున్నట్లు ఇంట్లో నమ్మించింది. మరోసారి గర్భం దాల్చిన ఆమె ఆదివారం ప్రసవించింది. ఆడపిల్ల పుట్టడంతో తుప్పల్లోకి విసిరేసింది.
అచ్యుతాపురం నుంచి ఫెర్రో కంపెనీకి వెళ్తున్న లారీ పశ్చిమబెంగాల్‌కి చెందిన ఆకుల బోరి అనే వ్యక్తిని ఢీకొంది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు సెజ్‌లోని కంటైనర్లను ఉపయోగించే పరిశ్రమల్లో జల్లెడపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నరసరావుపేట బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూదాల బాబురావుని నియమిస్తున్నట్లు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భక్కా పరంజ్యోతి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేటలోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా ప్రయాణించాలని అన్నారు. అన్ని వర్గాల వారు బాబురావు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
పాణ్యం సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌస్ దేశాయ్ స్వగ్రామం పెద్దకడబూరు మండలం కల్లుకుంట. బీఈడీ పూర్తిచేశారు. ఎస్ఎఫ్ఎలో చేరి విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. 1988లో సీపీఎం సభ్యత్వం పొందారు. అనేక ఉద్యమాలలో పాల్గొని నాయకత్వం వహించారు. 1993లో సీపీఎం సర్పంచిగా గెలిచేలా కృషి చేశారు. డీవైఎఫ్ఎ కర్నూలు నగర కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. సీఐటీయూ కర్నూలు నగర, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.
విశాఖ- హైదరాబాద్ నూతన విమాన సర్వీసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 11.40 గంటకు విశాఖలో బయలుదేరి 12.50 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అంతకముందు అదే సర్వీసు రాత్రి 9.35 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11.00 గంటలకు విశాఖ వస్తుంది. విమానయాన ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.
మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు కన్నయ్య వెంగళాయపాలెం దగ్గర నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని అందులో మిర్చి పంట వేశాడు. సరైన దిగుబడి రాకపోవడం వలన తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య శాంతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అత్యధికంగా తాడిపత్రిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బీ.సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. పెద్ద వడుగురు మండలంలో 41.8 డిగ్రీలు, బొమ్మణహల్‌లో 41.6, శెట్టూరులో 41.2, చెన్నేకొత్తపల్లి, శింగనమల, గుత్తి, విడపనకల్ మండలాల్లో 40.2, ధర్మవరంలో 40.8, యాడికిలో 40.6, గుంతకల్లులో 40.3, బీ.సముద్రం మండలంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.