India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భీమడోలు మండలం పూళ్ల గ్రామ సమీపంలో బస్సుయాత్ర వెనక వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా స్లో అయ్యాయి. దీంతో వెనక నుంచి బైక్‌పై వస్తున్న గుండు నరేశ్ కాన్వాయ్‌లోని కారును ఢీ కొట్టాడు. ప్రమాద తీవ్రతకు నరేశ్ కారు వెనకభాగం నుంచి లోపలికి చొచ్చుకెళ్లాడు. గాయపడిన అతణ్ని అంబులెన్సులో ఆశ్రం వైద్యశాలకు తరలించారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు, పలాస 18వ వార్డు కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ ఆయన భార్య కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు, అచ్చెన్నాయుడు సమీక్షంలో వీరు టీడీపీ గూటికి చేరారు. యామలపేట సర్పంచ్ సంజీవ్ కుమార్, వైసీపీ టెక్కలి మండల మాజీ అధ్యక్షుడు, సర్పంచ్ బగాది హరిబాబు తదితరులు పసుపు కండువా కప్పుకొన్నారు.
కామాక్షినగర్ సమీపంలో నివాసం ఉంటున్న పోస్టుమాస్టర్ వెంకటరమణ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణ గజపతినగరంలోని తన బంధువుల ఇంటికి ఈ నెల 13న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని సోమవారం ఉదయం 7గంటల సమయంలో పక్కింటి వారు చూసి సమాచారం ఇచ్చారు. వెంకటరమణ వచ్చి చూసేసరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
మండపేటలో YCP MLA అభ్యర్థి తోట త్రిమూర్తులు వాలంటీర్లతో సమావేశం నిర్వహించగా నియోజకవర్గంలోని దాదాపు 1200 మంది హాజరయ్యారు. ‘వాలంటీర్లంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వైసీపీ ప్రచారంలో పాల్గొనండి. మళ్లీ వచ్చేది వైసీపీనే..అందరినీ విధుల్లోకి తీసుకుంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. రాజీనామా చేసేందుకు గేటువద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశారు. 900మందికిపైగా రాజీనామా చేసినట్లు సమాచారం. అనంతరం పట్టణంలో ర్యాలీ తీశారు.
ఎన్నికల తేదీ సమీపించే కొద్ది నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. పెద్దసంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో పలువురు టీడీపీలోనూ చేరారు. జిల్లాలో సోమవారం నాటికి 2094 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన MBA, MCA, MSC 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో TDPకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రమేష్ రెడ్డి పార్టీని వీడారు. ప్రస్తుతం కమలాపురం మాజీ MLA వీర శివారెడ్డి YCPలోకి చేరుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కమలాపురం నుంచి 3సార్లు MLAగా గెలిచారు. TDP టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో TDPని వీడుతున్నాని సోమవారం ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీంతో ఆయన YCPలో చేరుతారా లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారా అనేది చూడాలి.
‘నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించండి. భయంతో, బాధ్యతతో పని చేస్తాను’ అని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. కొమరోలులో సోమవారం రాత్రి వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఎన్నికల్లో పోటీ చేయటానికి సింగిల్‌గా సింహంలా వస్తున్నాడని, చంద్రబాబు పొత్తు పెట్టుకుని వస్తున్నాడని చెప్పుకొచ్చారు.
ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నప్పుడే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదని కలెక్టర్ మనజీర్ జిలానీ సోమవారం సమూన్ అన్నారు. జిల్లా పరిషత్ మందిరంలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశాన్ని త్వరగా అవగాహన చేసుకోవాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు సందేహాలను నివృత్తి చేయాలన్నారు.
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ “జెర్సీ”(2019) ఈ నెల 20న విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విజయవాడ అలంకార్ థియేటర్‌లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. తిన్ననూరి గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జెర్సీ రీరిలీజ్ సందర్భంగా నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.