India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి గిద్దలూరు ఎంఆర్వో ఆఫీసు విజిట్ చేశారు. ఈసందర్భంగా ఆర్వో నాగజ్యోతి ద్వారా ఎన్నికల పర్యవేక్షణపై చేపట్టిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాష, ఎస్పీ రకుల్ జిందాల్ చెప్పారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. రూములు వద్ద తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఈవీఎం బాక్స్‌లను తరలించడానికి వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాక్సులు తరలించేటప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.
విజయవాడ మీదుగా ఈ నెల 17 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం విశాఖపట్నం-కొల్లామ్‌కు(నెం.08539) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో కొల్లామ్- విశాఖపట్నం(నెం.08540) మధ్య ఈ నెల 18 నుండి జూలై 4 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
ఈ నెల 16వ తేదీన జిల్లాలో ఎంపిక చేసిన 142 పాఠశాలల్లో స్టేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్టు డీఈఓ తాహేరా సుల్తాన తెలిపారు. సర్వేకు సంబంధించి సంసిద్ధత కార్యక్రమాన్ని స్థానిక కృష్ణవేణి ఐటీఐ కాలేజ్‌లో నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 142 పాఠశాలలకు చెందిన 3,299 మంది 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంలో ఏదైనా రెండు అంశాల్లో 90 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని విభాగాల నోడల్ అధికారులతో కలిసి సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), ఈ ఆర్వోలతో వీసీ నిర్వహించారు.
విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ముంబై సైబర్ పోలీస్ పేరుతో ఫోన్ చేసి ‘మీ పేరు మీద డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయి. మీరు అశ్లీల చిత్రాలు చూస్తున్నందుకు కేసు నమోదు చేశాం. మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు’ అని కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారని హెచ్చరించారు. అటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని సచివాలయం-1, 2 పరిధిలోని వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పేదలకు సేవ చేయలేనప్పుడు తాము వాలంటీర్లుగా కొనసాగలేమని, అందుకే తమకు తాము రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. గ్రామంలోని 58 మంది వాలంటీర్లు రాజీనామా లేఖలను సంబంధిత అధికారులకు అందజేశారు.
గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి కనిపించలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ మేరకు అనకాపల్లి గవరపాలెం ఓ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నియోజకవర్గంలో గత ఎన్నికలలో అమరనాథ్‌ను గెలిపించి తప్పు చేశామని, ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
అల్లూరి జిల్లా పాడేరు 108 సూపర్వైజర్ ఇబ్రహీం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విధుల్లో ఉన్న సూపర్వైజర్ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు గాజువాక వెళ్లారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదంతో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిగా.. అప్పటికే మృతి చెందాడు. 108 సిబ్బంది, ఉద్యోగులతో ఎంతో సఖ్యతగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పాప ఉన్నారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో విషాదం నెలకొంది. దిబ్బలపాలెంకు చెందిన లోవదుర్గ ఈ రోజు తెల్లవారుజామున వాడపల్లి వెంకన్నబాబు దర్శనం నిమిత్తం అదే వీధికి చెందిన మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆటోలో బయలుదేరింది. ఎర్రవరం హైవేపై గల వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ వద్దకు ఆ ఆటో వెళ్లగా.. లోవదుర్గకు వాంతులు రావడంతో తల బయటకు పెట్టింది. ఆ సమయంలో వాహనం ఆమె తలను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది.
Sorry, no posts matched your criteria.