Andhra Pradesh

News April 15, 2024

ఏలూరు: సీఎం జగన్ బస చేసేది ఇక్కడే

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News April 15, 2024

పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే పథకాలు: బొత్స ఝాన్సీ

image

పేదలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్‌తో కలిసి కొత్తపాలెంలో సోమవారం ప్రచారం చేశారు. పొరపాటున చంద్రబాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని, అప్పుడు పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే పథకాలు అందిస్తారన్నారు. పేదల కోసం పాటుపడుతున్న జగన్‌ను గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు.

News April 15, 2024

విజయనగరం: తాటిచెట్టు నుంచి పడి మృతి

image

పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ గొల్లపేట గ్రామానికి చెందిన కె.రాజారావు(45) కూలిపని నిమిత్తం ఎస్.కోట మండలం ముషిడిపల్లి గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం తాటికాయల కోసం తాటిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడడంతో గాయాలయ్యాయి. రాజారావు ఘటనా స్థలంలోనే సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.కోట సీఐ వై.ఎంరావు తెలిపారు.

News April 15, 2024

నంద్యాల బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

image

నంద్యాలకు చెందిన రేణుక కడప జిల్లా రాజంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.

News April 15, 2024

రేపు కోసిగిలో బాలకృష్ణ పర్యటన

image

రేపు కోసిగిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారని జిల్లా TDP అధ్యక్షులు BT నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఈనెల 16న సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా TDP అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.

News April 15, 2024

రామచంద్రాపురం: 130 మంది వాలంటీర్లు రాజీనామా

image

రామచంద్రాపురం మండలంలోని 23 పంచాయతీల పరిధిలో 130 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో ప్రత్యూషకు అందజేశారు. ప్రతిపక్షాలు తమపై ఆరోపణలు చేయడం బాధించాయని తెలిపారు.

News April 15, 2024

పర్చూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

పర్చూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు నుంచి పెద్దివారిపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న రావి విజయ భాస్కర్‌ని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇరువురిని 108లో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో విజయ భాస్కర్‌ మృతి చెందగా, మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నారు.

News April 15, 2024

ఏలూరు: సీఎం జగన్ బస చేసేది ఇక్కడే

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News April 15, 2024

కడప: 20 నుంచి YVU డిగ్రీ పరీక్షలు

image

కడప: యోగి వేమన యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల1, 2, 4, 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ (2023- 24), బ్యాచ్, 2వ సెమిస్టర్ (2016-17), (2020-21), (2023-24) బ్యాచ్ లు, 4వ సెమిస్టర్ (2016-17), (2023-24) బ్యాచ్, 6వ సెమిస్టర్ (2016-17) విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.

News April 15, 2024

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

పొన్నూరు పట్టణ శివారు జీబీసీ రోడ్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ప్రశాంత్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక యువకుడు మన్సూర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పొన్నూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.