India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. వెంకటగిరిలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లలో కురుగొండ్ల ఒక్కరే వెంకటగిరి నియోజవర్గ చరిత్రలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా నిలిచారు. నేదురమల్లి రాజ్యలక్ష్మి రెండు సార్లు విజయం సాధించగా.. మిగిలిన ఎవరూ తిరిగి ఇక్కడి నుంచి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు.

ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఫోటో దిగారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం పార్లమెంటు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

జిల్లా పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో(ఐటిఐ) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐ, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్.సుధాకర్‌రావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో 3816సీట్లు ఉండగా, 2107మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 752మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారన్నారు. మిగిలిన1355 మంది ఈనెల10వ తేదీలోగా హాజరుకావాలి.

విజయవాడ లోక్‌సభకు 1952 నుంచి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికలలో కేశినేని శివనాథ్ (చిన్ని) సాధించిన 2,82,085 మెజారిటీనే అత్యధికం. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన KLరావు సాధించిన 1,56,004 ఓట్ల మెజారిటీని తాజా ఎన్నికల్లో చిన్ని తన భారీ మెజారిటీతో చెరిపేశారు. చిన్ని తాజా గెలుపుతో విజయవాడ లోక్‌సభలో వరుసగా 3వ సారి టీడీపీ జెండా ఎగిరింది.

అద్దంకిలోని ఆయిల్ మిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారం, రూ.2.25 లక్షలు నగదు, 3 రకాలైన డైమండ్స్‌ను దోచుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెల్లం రాజేశ్ ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుండగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. ఇంటి యజమాని తాళాలు పగలగొట్టి ఉండటం చూసి రాజేశ్‌కి సమాచారమిచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను జూలై 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ (ఎగ్జామినేషన్స్) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. తేదీల వారీగా పరీక్షలు వివరాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్ -2024 కౌన్సిలింగ్‌కు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 2,307 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన గురువారం నిర్వహించగా, 256 మంది హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 181, ఎస్సీ ఎస్టీలు 75 మంది ఉన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి.దామోదర్ రావు తెలిపారు.

నరసరావుపేట టీడీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాయలు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇందులో తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీలుగా గెలిచిన వారందరూ ఉన్నారు. ప్రధానితో ఎన్డీఏ భాగస్వాముల భేటీలో పాల్గొనేందుకు ఎంపీలంతా చంద్రబాబుతో కలిసి దిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి, వైసీపీ మధ్యనే పోటీ జరిగింది. అయితే కాంగ్రెస్‌తో పాటు స్వతంత్రులు కనీస ప్రభావం చూపలేకపోయారు. కూటమి, వైసీపీ మినహా మిగిలిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. కాకినాడ జిల్లాలో 92 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 97 మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 20 మంది, వెరసి 254 మంది డిపాజిట్లు కోల్పోయారు.

వైసీపీ ఓటమిపై కాకినాడ గ్రామీణ మండలం రాయుడిపాలేనికి చెందిన ఆరుద్ర ఆనందం వ్యక్తం చేశారు. ఈమె గతంలో CM కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా ఆమె కొంతకాలం క్రితం రాష్ట్రాన్ని వీడి వారణాసికి వెళ్లిపోయారు. ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు.. వారంతా నాకు మద్దతు ఇచ్చేలా చంద్రబాబును నిలబెట్టారు. మాకు జరిగిన అన్యాయంపై రాష్ట్రానికి వచ్చి వారిని కలుస్తాను’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.