Andhra Pradesh

News June 7, 2024

నూజివీడు: చూసి నవ్వినందుకు.. కత్తిపోట్లు

image

నూజివీడులో నిన్న <<13390738>>కత్తిపోట్ల ఘటన<<>> కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు.. నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయి, సుధీర్‌ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్‌ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.

News June 7, 2024

పిఠాపురం: YS.జగన్‌కు ధన్యవాదాలు: వంగా గీత

image

ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం పిఠాపురం రాజుగారి కోటలోని వైసీపీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌‌లు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన YS.జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News June 7, 2024

TDP ప్రభుత్వంలో మార్కాపురం జిల్లా.?

image

వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని ప్రజల ఆకాంక్ష. జిల్లాలో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీనినే TDP ఆయుధంగా తీసుకొని అధికారం చేపడితే మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతుందని ప్రజలు ధీమాగా ఉన్నారు. మరి TDP ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నారా!

News June 7, 2024

మెట్టు స్వగ్రామంలో టీడీపీకి మెజారిటీ

image

రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు 41,659 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెుదటి రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో కొనసాగింది. కాగా రాయదుర్గం పట్టణంలో టీడీపీకి 16,200 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి స్వగ్రమామైన బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలో మెుదటిసారి టీడీపీకి 337 ఓట్ల మెజారిటీ వచ్చింది.

News June 7, 2024

జగన్‌తో తిరుపతి ఎంపీ భేటీ

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి ఎంపీగా గెలిచిన మద్దిల గురుమూర్తి గురువారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ఓటమికి గల కారణాలను ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని జగన్, గురుమూర్తికి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

News June 7, 2024

కర్నూలు: 25 ఏళ్ల తర్వాత.. 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. 2014లో ముగ్గురు ఎమ్మెల్యేలకు పరిమితమైన టీడీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలోని పాణ్యం, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరులో 25 ఏళ్ల తర్వాత మెుదటిసారి టీడీపీ గెలుపొందింది. కాగా కోడుమూరులో 39 ఏళ్ల తర్వాత మెుదటిసారి టీడీపీ జెండా ఎగరవేసింది.

News June 7, 2024

కడప జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?

image

జగన్ ఇలాకాపై TDP పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గ స్థానాల్లో ఏడింటిలో గెలిచింది. దీంతో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందా అనదే చర్చ. YCP కంచుకోటలో భారీ మెజార్టీ సాధించడంలో నేతల కృషి మరువలేనిది. పలువురు మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. మరి సామాజికవర్గాల వారిగా పరిశీలించి చంద్రబాబు కేబినేట్‌లోకి ఎవరిని చేర్చుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

News June 7, 2024

విజయనగరం మహిళా మంత్రి ఎవరు?

image

విజయనగరం చరిత్రలో ఐదుగురు మహిళా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. కురుపాంలో జగదీశ్వరి, సాలూరులో సంధ్యారాణి, విజయనగరంలో అదితి గజపతి, నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున గెలిచిన లోకం మాధవి మొదటిసారి అసెంబ్లీకి వెళుతన్నారు. అటు ఎస్.కోటలో మూడోసారి నెగ్గిన కోళ్ల లలితకూమారి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించనున్నారు. మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.

News June 7, 2024

కర్నూలు: తండ్రీకుమారులు ఒకే పార్టీతో ప్రవేశం.. విజయం

image

తండ్రీకుమారులు టీజీ వెంకటేశ్, టీజీ భరత్ ఇద్దరూ టీడీపీతోనే రాజకీయ రంగప్రవేశం చేసి విజయం సాధించారు. టీజీ వెంకటేశ్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా1999లో రాజకీయ ప్రవేశం చేసి గెలుపొందారు. ఆయన కుమారుడు టీజీ భరత్ 2019లో టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా 2024లో వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై 18876 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు.

News June 7, 2024

ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ టెక్కలి నియోజకవర్గం వారే

image

టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇద్దరూ టెక్కలి నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. కాగా ఇద్దరూ బాబాయి-అబ్బాయిలు కావడం మరో విశేషం. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు కాగా, కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇరువురు టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ గ్రామానికి చెందినవారు.