Andhra Pradesh

News April 15, 2024

 470కి 465మార్కలు సాధించిన ధర్మవరం విద్యార్థిని

image

ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన కే.మహబూద 465/470 మార్కులతో సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మెుదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని మహబూద మాట్లాడుతూ.. ఇంజినీర్ కావడమే లక్ష్యంగా తన చదువును కొనసాగిస్తానని తెలిపారు.

News April 15, 2024

ప.గో: జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి ప.గో షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం 9AMకు ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి రాచూరు, నిడమర్రు, గణపవరం, కొలమూరు, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. 4.30PMకు భీమవరంలో బహిరంగ సభ. అనంతరం రోడ్ షో కొనసాగుతుంది. గరగపర్రు, ఉందుర్రు క్రాస్, సీహెచ్ అగ్రహారం, ముదునూరు, రావిపాడు, దువ్వ, తణుకు, ఖండవల్లి మీదుగా తూర్పు గోదావరి జిల్లా ఈతకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 15, 2024

రామతీర్థం రాములోరికి గోటితో ఒలిచిన తలంబ్రాలు 

image

పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రాములోరికి శ్రీరామతీర్థం సంఘం గోటితో ఒలిచిన తలంబ్రాలను సోమవారం మధ్యాహ్నం సమర్పించారు. 2017 నుంచి రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శనం విజయకుమార్ వెల్లడించారు. కోలాట బృందాలతో ఊరేగింపుగా గోటితో ఒలిచిన తలంబ్రాలను ఆలయ ఈఓ వై.శ్రీనివాసరావుకి అందజేశారు.

News April 15, 2024

మండపేటలో 1000 మందికి పైగా వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మండపేట నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధించిందన్నారు.

News April 15, 2024

SKLM: ‘ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలి’

image

జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. సోమవారం శ్రీకాకుళం పట్టణంలో జిల్లా కోర్టులో వీడియో కాన్ఫరెన్ష్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో పోలీసులు త్వరతగితిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి, కోర్టు వారికి పోలీసు వారు సహకరించాలని కోరారు.

News April 15, 2024

నూరు శాతం తాగునీటి చెరువులను నింపండి: కలెక్టర్

image

ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీటితో జిల్లాలో ఇప్పటి వరకు 150 చెరువులను 70-80% మేర నింపినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ చెరువులు నింపేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. మరో 4 రోజుల్లో నీటి విడుదల నిలిపి వేయనున్న నేపథ్యంలో 100% చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 15, 2024

ఒంగోలులో బైక్ దొంగలు అరెస్టు

image

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు సోమవారం తెలిపారు. ఒంగోలులో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిఘా ఉంచారు. సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించి, వారి వద్ద నుంచి 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

News April 15, 2024

కుప్పం: గంట వ్యవధిలోనే రెండు పార్టీలలో చేరిక

image

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కుప్పం మండలం మహమ్మద్ పురం పంచాయతీ గణేష్ పురానికి చెందిన వైసీపీ వార్డు సభ్యుడు పళణి సోమవారం టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే గంట గడవకముందే మళ్లీ చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకుని సొంత గూటికి చేరారు.

News April 15, 2024

హిందూపురం జిల్లాగా ప్రకటించాలని నిరాహార దీక్ష

image

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ పట్టణ వైసీపీ కన్వీనర్ నరేశ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీఎస్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించలేని పక్షంలో హిందూపురం నుంచి జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

News April 15, 2024

చంద్రబాబు సీట్లను అమ్ముకున్నాడు: వీర శివారెడ్డి

image

ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే సీట్లను అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపించారు. కోగటంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 4 సార్లు ఓడి, ప్రజాదరణ లేని పుత్తా కుటుంబానికి ఏ విధంగా టికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సీనియార్టీని కాదని డబ్బుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.