India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీటితో జిల్లాలో ఇప్పటి వరకు 150 చెరువులను 70-80% మేర నింపినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ చెరువులు నింపేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. మరో 4 రోజుల్లో నీటి విడుదల నిలిపి వేయనున్న నేపథ్యంలో 100% చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు సోమవారం తెలిపారు. ఒంగోలులో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిఘా ఉంచారు. సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించి, వారి వద్ద నుంచి 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కుప్పం మండలం మహమ్మద్ పురం పంచాయతీ గణేష్ పురానికి చెందిన వైసీపీ వార్డు సభ్యుడు పళణి సోమవారం టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే గంట గడవకముందే మళ్లీ చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకుని సొంత గూటికి చేరారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ పట్టణ వైసీపీ కన్వీనర్ నరేశ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీఎస్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించలేని పక్షంలో హిందూపురం నుంచి జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.
ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే సీట్లను అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపించారు. కోగటంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 4 సార్లు ఓడి, ప్రజాదరణ లేని పుత్తా కుటుంబానికి ఏ విధంగా టికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సీనియార్టీని కాదని డబ్బుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
అనంతపురంలోని టీటీడీ కళ్యాణమండపంలో సివిల్స్ పరీక్షలపై నారాయణ ఐఏఎస్ అకాడమీ ఆదివారం ఒకరోజు ఉచిత వర్క్ షాప్ నిర్వహించింది. కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ మాట్లాడుతూ.. సాధన కోసం వీలైనంత త్వరగా ప్రిపరేషన్ ప్రారంభించాలన్నారు. ఇందుకోసం ఇంటర్ డిగ్రీ నుంచే దృష్టి సారిస్తే లక్ష్యం సులభతరమవుతుందని తెలిపారు. నారాయణ IAS అకాడమీ DGM, R & D H.శివనాథ్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడిన ఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రామసముద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సొంత పనిమీద పుంగనూరుకు బైకులో వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గమధ్యంలోని కుదురుచీమనపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి బాధితుల్ని 108లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉమ్రాహ్ (మక్కా) యాత్ర వెళ్లొచ్చిన సందర్భంగా సీఎం జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవిత్రమైన మక్కా జమ్-జమ్ నీళ్లు, ఖర్జూర ఇచ్చి జగన్‌కు అల్లాహ్ దీవెనలు ఉండాలని ప్రత్యేక దువా చేశారు. జగన్‌పై దాడి అనంతరం కేసరపల్లి క్యాంప్ వద్ద ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. పెత్తందారుల కుట్రలను ఛేదించడానికి మళ్లీ జనంలోకి జగన్ వచ్చారన్నారు.
దాడులు చేస్తే ఉన్నత పదవులిస్తామని నారా లోకేష్ ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మలికిపురం సభలో ఆయన మాట్లాడుతూ.. TDPది హింసాత్మక ధోరణి అని అన్నారు. జగన్ సభలకు జనం పోటెత్తుతున్నారని, ఇరుకు సందులో పెట్టినా చంద్రబాబు సభలకు జనం రావటం లేదన్నారు. CM జగన్‌ను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాళ్ల దాడి జరిగిందని ముధున్ రెడ్డి ఆరోపించారు.
“మై డియర్ దొంగ” మూవీ టీం సోమవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మూవీలో నటించిన “ఈ నగరానికి ఏమైంది” ఫేమ్ అభినవ్.. ఇతరులు నిఖిల్, దివ్యశ్రీ, షాలిని తదితరులు దుర్గమ్మను దర్శించుకుని అర్చక స్వాముల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మై డియర్ దొంగ మూవీని చూసి ఆదరించాలని అభినవ్ ప్రేక్షకులను కోరారు.
Sorry, no posts matched your criteria.