India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దాడుల నుంచి కాపాడి కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయం కమిటీలను ఏర్పాటు చేసింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్, ఆర్కే రోజా, సునీల్ కుమార్, వెంకటేగౌడ, రెడ్డెప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, విజయానందరెడ్డిని కమిటీలో నియమించింది. జిల్లాలో ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటారు.

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో ధర కేజీ రూ.261.29 పలికిందని వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పొందూరు ప్లాస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 900 పొగాకు బేళ్లు తీసుకురాగా 840పొగాకు బేళ్లు కొనుగోలు అయ్యాయని పేర్కొన్నారు. పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.332, కనిష్ఠ ధర రూ.205 పలికిందని చెప్పారు. ఈ వేలంలో మొత్తం 40 మంది వ్యాపారులు పాల్గొన్నట్లు వివరించారు.

రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న షేక్ ముక్తియార్ అలీకి అనంతపురం JNTU పీహెచ్‌డీ ప్రధానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ తెలిపారు. ‘కాస్ట్ అలకేషన్ ఇన్ ఏడీ రెగ్యులేటరీ పవర్ సిస్టమ్ విత్ రిలైబులిటీ ఇండెక్స్’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ ప్రధానం జరిగిందని తెలిపారు.

ఆచంటలోని గంధర్వ మహల్ నిర్మాణానికి అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. నాటి సీఎంలు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆచంట వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు. గంధర్వ మహల్ ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ మహల్‌ను నిర్మించిన గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు మహల్ ముస్తాబవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు నెల్లిమర్ల పట్టణానికి చెందిన నౌపడ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసరెడ్డికి పంపించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

తుంగభద్ర నీటి పంపకంపై ఆంధ్ర-కర్ణాటక ఇంజినీర్లు సమావేశాన్ని నిర్వహించారు. తుంగభద్ర జలాశయం పరిధిలో ఉన్న వివిధ కాలువలకు నీటి పంపకంపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీఈ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో ఈసారి తుంగభద్ర జలాశయంకు 172 టీఎంసీలు వరద నీరు చేరుతుందని సమావేశంలో అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక ఇంజినీర్లు అధికారులు పాల్గొన్నారు.

ఆలూరు నియోజకవర్గ పరిధి లోని తుంగభద్ర జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు అడుగంటింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా.. 3.373 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 1,633.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,577. 49 అడుగులు ఉన్నాయి. తుంగభద్ర డ్యాం కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు రోజురోజుకు పెరుగుతుంది.

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు 50 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జిల్లా ఎస్పీ రాధిక, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆధ్వర్యంలో ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగనున్నాయి.

చేజర్ల మండలంలోని పలు దుకాణాల్లో ఓ కంపెనీకి చెందిన ఎక్స్‌పైర్ డేట్ శీతల పానీయాలు తరచూ కనిపిస్తున్నాయి. గురువారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఓ దుకాణంలో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన మాజా ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిందని గమనించారు. ఇటీవల పొదలకూరులో కూడా వెలుగు చూశాయి. దీంతో అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు తిరుపతిలో సాదర స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ముఖేష్ కుమార్ మీనాకి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు. తిరుపతిలో విశ్రాంతి అనంతరం తిరుమలకు చేరుకొని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.