Andhra Pradesh

News April 15, 2024

జగన్‌కు ఉమ్రాహ్ నీళ్లు, ఖర్జూర అందజేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

image

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉమ్రాహ్ (మక్కా) యాత్ర వెళ్లొచ్చిన సందర్భంగా సీఎం జగన్‌‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవిత్రమైన మక్కా జమ్-జమ్ నీళ్లు, ఖర్జూర ఇచ్చి జగన్‌కు అల్లాహ్ దీవెనలు ఉండాలని ప్రత్యేక దువా చేశారు. జగన్‌‌పై దాడి అనంతరం కేసరపల్లి క్యాంప్‌ వద్ద ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. పెత్తందారుల కుట్రలను ఛేదించడానికి మళ్లీ జనంలోకి జగన్ వచ్చారన్నారు.

News April 15, 2024

జగన్‌ను హత్య చేసేందుకే రాళ్ల దాడి: మిధున్ రెడ్డి

image

దాడులు చేస్తే ఉన్నత పదవులిస్తామని నారా లోకేష్ ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మలికిపురం సభలో ఆయన మాట్లాడుతూ.. TDPది హింసాత్మక ధోరణి అని అన్నారు. జగన్ సభలకు జనం పోటెత్తుతున్నారని, ఇరుకు సందులో పెట్టినా చంద్రబాబు సభలకు జనం రావటం లేదన్నారు. CM జగన్‌ను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాళ్ల దాడి జరిగిందని ముధున్ రెడ్డి ఆరోపించారు.

News April 15, 2024

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మూవీ టీం

image

“మై డియర్ దొంగ” మూవీ టీం సోమవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మూవీలో నటించిన “ఈ నగరానికి ఏమైంది” ఫేమ్ అభినవ్.. ఇతరులు నిఖిల్, దివ్యశ్రీ, షాలిని తదితరులు దుర్గమ్మను దర్శించుకుని అర్చక స్వాముల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మై డియర్ దొంగ మూవీని చూసి ఆదరించాలని అభినవ్ ప్రేక్షకులను కోరారు.

News April 15, 2024

ధర్మవరం: ఆర్టీసీ మెకానిక్ కూతురికి.. జిల్లా రెండో ర్యాంకు

image

ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన ఏ.మాధురి సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకును సాధించింది. ధర్మవరంలోని ఓ కళాశాలలో ఎంపీసీ విభాగంలో 987/1000 మార్కులు సాధించింది. తండ్రి ఆర్టీసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.  

News April 15, 2024

ప్రకాశం: ఏప్రిల్ వచ్చినా అందని మార్చి నెల జీతం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 300 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్టీ గురుకుల పాఠశాలలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయలుగా పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతన పద్ధతి అమలు కానప్పటికి, ఇస్తున్నటువంటి రూ.15 వేలు, నెల నెల జీతం అందడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మార్చి నెల జీతాన్ని విడుదల చేయవలసిందిగా ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News April 15, 2024

ప.గో: మీకు తెలుసా..? ‘200 ఏళ్ల చరిత్ర గల రామాలయం’

image

ప.గో జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామంలో వెలిసిన శ్రీరామాలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ మునులు, ఋషులు తపస్సు ఆచరించారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఏటా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, దాదాపు 2వేల మందికి అన్నసమారాధన చేస్తారని తెలిపారు. ఆలయం వద్ద చలువ పందిరి, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

News April 15, 2024

చిత్తూరు: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంబళ్లపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్సై శివ కుమార్ కథనం.. కురబలకోట మండలం, గొడ్డిన్లవారిపల్లికి చెందిన మంజునాథ్ తన భార్య సుజాతతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది, తంబళ్లపల్లి మండలం, కుక్కరాజుపల్లి సమీపంలోని కుమ్మరపల్లి వద్ద ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 15, 2024

అత్యాచారయత్నం.. మర్మాంగం కోసేసిన మహిళ

image

అత్యాచారం చేయబోయిన ఓ వ్యక్తిపై తిరగబడిన మహిళ అతడి మర్మాంగం కోసేసింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరంలో ఆదివారం రాత్రి జరిగింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారం చేయబోయిన అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ
మర్మాంగాన్ని మహిళ బ్లేడుతో కోసింది. ఈ ఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. సత్యనారాయణ అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 15, 2024

విజయవాడ: 20న కృష్ణా వర్శిటీ నెట్ బాల్ మహిళల టోర్నీ

image

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి వి.లక్ష్మీ కనకదుర్గ తెలిపారు. ఈ టోర్నీలో కృష్ణా వర్శిటీ జట్టు ఎంపిక చేసే యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ ఆధ్వర్యంలో జరుగనున్న అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి పంపనున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు.

News April 15, 2024

రాజంపేట: హాస్టల్‌లో ఉరి వేసుకుని విద్యార్థిని సూసైడ్

image

రాజంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన రేణుక కొత్త బోయనపల్లి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.