India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీ- ఫార్మసీ ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ప.గో జిల్లా తణుకు మండలం తేతలి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తణుకు రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు(59) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం సైకిల్‌పై తణుకు వైపు వస్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు.

నెల్లూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ (2,45,902)తో గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న వేమిరెడ్డి కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్నీ స్థానాలు గెలవడానికి కూడా ఆయన కృషి ఉంది.

ప్రొద్దుటూరు ఆగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్త్యేశ్వర స్వామికి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరికి పంచామృతాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం ఆగస్త్యేశ్వర స్వామి మూలవిరాట్‌కు వేద పండితులు మంత్రోచ్ఛారణలతో భస్మాభిషేకం నిర్వహించి భస్మ హారతి ఇచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి వినాయక నగర్లో దొంగలు చొరబడి షకీల ఇంట్లో 46 గ్రాముల బంగారం, రూ.80 వేల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. వినాయక నగర్లో ఉండే షకీల బుధవారం రాత్రి పనిపై తాళం వేసుకొని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు తలుపులు పగల గొట్టి చోరీ చేయడాన్ని గురువారం గుర్తించింది. ఫిర్యాదుపై స్పందించి క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

సంతమాగులూరు మండలంలోని తంగేడిమల్లిలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం పాక్షికంగా ధ్వంసం చేశారు. గ్రామం సమీపాన ఉన్న వైఎస్సార్ విగ్రహం చేతిని దుండగులు విరగగొట్టారు. అలాగే గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన వరసల ముత్యాలరావు సోషల్ మీడియాలో కులాలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ మెసేజ్ పెట్టాడని, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ విధమైన నేరాలకు ఎవరు పాల్పడినా కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

పట్టణంలోని ఓ ఇంట్లో కుళ్లిన మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. నగరంపాలెం స్టాల్ హై స్కూల్ ఎదురుగా ఓ ఇంటిలో నుంచి దుర్వాసన రాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడు రాంబాబుగా గుర్తించామన్నారు. అనారోగ్య కారణాలతో చాలా రోజుల కిందట చనిపోయినట్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

నరసాపురం ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా.. వారిలో ముగ్గురు నాయకర్ పేర్లతో ఉన్నారు. ఆ ముగ్గురిలో జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ గ్లాస్ గుర్తుకు 94,116 (64.72%) ఓట్లు వచ్చాయి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లి సత్య నాయకర్ బకెట్ గుర్తుకు 11,72 (0.81%) ఓట్లు దక్కాయి. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి పాలెపు సత్య నాయకర్ పెన్‌స్టాండ్ గుర్తుకు 343 (0.24%) ఓట్లు వచ్చాయి.

ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో యువ రైతు వడ్డే బజారి (32) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బళ్లారి ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.