India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నరసాపురం ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా.. వారిలో ముగ్గురు నాయకర్ పేర్లతో ఉన్నారు. ఆ ముగ్గురిలో జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ గ్లాస్ గుర్తుకు 94,116 (64.72%) ఓట్లు వచ్చాయి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లి సత్య నాయకర్ బకెట్ గుర్తుకు 11,72 (0.81%) ఓట్లు దక్కాయి. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి పాలెపు సత్య నాయకర్ పెన్‌స్టాండ్ గుర్తుకు 343 (0.24%) ఓట్లు వచ్చాయి.

ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో యువ రైతు వడ్డే బజారి (32) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బళ్లారి ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లలో కలిపి NOTAకు 37,783 ఓట్లు పడ్డాయి. నియోజకవర్గాల వారీగా నోటాకు పడ్డ ఓట్ల సంఖ్య:☞ శ్రీకాకుళం- 3373☞ ఆముదాలవలస- 2300☞ పలాస- 2742☞ పాలకొండ- 4260☞ పాతపట్నం- 3604☞ టెక్కలి- 7342☞ ఇచ్చాపురం- 4374☞నరసన్నపేట- 3300☞ రాజాం- 2536☞ ఎచ్చెర్ల- 3952 పడ్డాయి.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడిగా ఉన్నటువంటి ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అన్నారు. తన రాజీనామా పత్రాన్ని చీఫ్ సెక్రటరీకి ఈ మెయిల్ ద్వారా పంపినట్లు తిరుపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తిరుపాల్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆచంటలోని గంధర్వ మహల్ నిర్మాణానికి అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. నాటి సీఎంలు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆచంట వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు. గంధర్వ మహల్ ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ మహల్‌ను నిర్మించిన గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు మహల్ ముస్తాబవుతోంది.

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

చిలమత్తూరు మండల కేంద్రంలోని కొడికొండ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి ఆదేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న వాహనదారులు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాళ్లపూడి మండల కేంద్రంలోని ట్యాక్సీ స్టాండ్ సమీపంలో గోదావరి నదిలో గురువారం మధ్యాహ్నం మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్సై శ్యాంసుందర్ తెలిపారు. మృతురాలి వయసు 45-50 సంవత్సరాల లోపు ఉంటుందన్నారు. ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉందని, ఆచూకీ తెలిసిన వారు 94407 96625 నంబర్‌కు సంప్రదించాలని ఎస్సై కోరారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం చేసిన కృషి సఫలీకృతమైంది. ఏ చిన్న పొరపాటుకు అస్కారం లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువురు అధికారులు ఎంతో సమస్వయంతో వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన కలెక్టర్, ఎస్పీలు జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

మణిపుర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన మెట్ట తేజేశ్వరరావు(33) అనే సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఎన్నికల విధులకు హాజరై తిరిగి తమ బెటాలియన్‌తో కలిసి వాహనంలో వెళ్తున్న సమయంలో వెనుక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తేజేశ్వరరావు మృతి చెందాడు. దీంతో జవాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని టెక్కలి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.
Sorry, no posts matched your criteria.