Andhra Pradesh

News April 15, 2024

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

పొన్నూరు పట్టణ శివారు జీబీసీ రోడ్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ప్రశాంత్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక యువకుడు మన్సూర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పొన్నూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 15, 2024

విజయనగరం : మీడియా సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్

image

పోస్టల్ బ్యాలెట్ కోసం అత్యవసర సేవలందిస్తున్న శాఖల లో పని చేస్తున్న ఉద్యోగుల, ఎన్నికల విధులలో పాల్గొంటున్న పాస్ లు పొందిన మీడియా వారి కి ఓటింగ్ కోసం పోస్టల్ బ్యాలెట్ ను అందించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అత్యవసర సేవలను అందించే అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు.

News April 15, 2024

విశాఖ: ఎన్నికల వ్యయం లెక్కలు పక్కాగా రాయాలి

image

ఎన్నికల వ్యయానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు పక్కా రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఆర్.వో., జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన రోజు నుంచి అభ్యర్థుల ఖాతాల్లో వ్యయానికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తామని వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

News April 15, 2024

 470కి 465మార్కలు సాధించిన ధర్మవరం విద్యార్థిని

image

ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన కే.మహబూద 465/470 మార్కులతో సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మెుదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని మహబూద మాట్లాడుతూ.. ఇంజినీర్ కావడమే లక్ష్యంగా తన చదువును కొనసాగిస్తానని తెలిపారు.

News April 15, 2024

ప.గో: జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి ప.గో షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం 9AMకు ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి రాచూరు, నిడమర్రు, గణపవరం, కొలమూరు, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. 4.30PMకు భీమవరంలో బహిరంగ సభ. అనంతరం రోడ్ షో కొనసాగుతుంది. గరగపర్రు, ఉందుర్రు క్రాస్, సీహెచ్ అగ్రహారం, ముదునూరు, రావిపాడు, దువ్వ, తణుకు, ఖండవల్లి మీదుగా తూర్పు గోదావరి జిల్లా ఈతకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 15, 2024

రామతీర్థం రాములోరికి గోటితో ఒలిచిన తలంబ్రాలు 

image

పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రాములోరికి శ్రీరామతీర్థం సంఘం గోటితో ఒలిచిన తలంబ్రాలను సోమవారం మధ్యాహ్నం సమర్పించారు. 2017 నుంచి రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శనం విజయకుమార్ వెల్లడించారు. కోలాట బృందాలతో ఊరేగింపుగా గోటితో ఒలిచిన తలంబ్రాలను ఆలయ ఈఓ వై.శ్రీనివాసరావుకి అందజేశారు.

News April 15, 2024

మండపేటలో 1000 మందికి పైగా వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మండపేట నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధించిందన్నారు.

News April 15, 2024

SKLM: ‘ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలి’

image

జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. సోమవారం శ్రీకాకుళం పట్టణంలో జిల్లా కోర్టులో వీడియో కాన్ఫరెన్ష్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో పోలీసులు త్వరతగితిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి, కోర్టు వారికి పోలీసు వారు సహకరించాలని కోరారు.

News April 15, 2024

నూరు శాతం తాగునీటి చెరువులను నింపండి: కలెక్టర్

image

ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీటితో జిల్లాలో ఇప్పటి వరకు 150 చెరువులను 70-80% మేర నింపినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ చెరువులు నింపేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. మరో 4 రోజుల్లో నీటి విడుదల నిలిపి వేయనున్న నేపథ్యంలో 100% చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 15, 2024

ఒంగోలులో బైక్ దొంగలు అరెస్టు

image

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు సోమవారం తెలిపారు. ఒంగోలులో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిఘా ఉంచారు. సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించి, వారి వద్ద నుంచి 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.