India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో అత్యధికులు ఈసారి TDPకే వేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆ ఓట్లే TDPని గెలిపించాయి. ఇక్కడ ముత్తుముల అశోక్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 973 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గిద్దలూరు నియోజకవర్గంలో చెల్లుబాటు అయిన ఓట్లు 3,449. అందులో TDP అభ్యర్థికి 2,271రాగా, YCPకి 1,130 ఓట్లు వచ్చయి. దీంతో అశోక్ రెడ్డి గెలుపులో ఓట్లు కీలకం అయ్యాయి.

విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.

మచిలీపట్నం లోక్‌సభకు జరిగిన తాజా ఎన్నికలలో NOTAకు మొత్తం 12,126 ఓట్లు పడ్డాయి. వీటిలో EVMలలో 12,008, పోస్టల్ బ్యాలెట్లలో 1,18 ఓట్లు పడ్డాయి. కాగా పోటీ చేసిన 15 మంది అభ్యర్థులలో విజేతగా నిలిచిన బాలశౌరి(జనసేన), చంద్రశేఖర్(వైసీపీ), గొల్లు కృష్ణ(కాంగ్రెస్) తర్వాత NOTAకు అత్యధికంగా ఓట్లు పడటంతో NOTA 4వ స్థానంలో నిలిచింది.

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గురువారం మహానంది ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం వేద పండితులు ఆయనకు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి విజయకేతనం ఎగురవేసింది అని హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు ఎంపీగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారికి బాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుకుంపేట మండలానికి మహర్దశ పట్టనుందా అనేది భవిష్యత్తులో తేలనుంది. హుకుంపేట మండలానికి చెందిన ఇరువురు ఎంపీ, ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అరకు పార్లమెంట్ సభ్యురాలిగా అడ్డుమండ గ్రామానికి చెందిన గుమ్మ తనూజారాణి, అరకు ఎమ్మెల్యేగా కొంతిలి గ్రామానికి చెందిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. ఇద్దరూ వైసీపీ నుంచి విజయం సాధించడం కొస మెరుపు.

అదృష్టం ఉంటే తనకు మంత్రిత్వ శాఖ దక్కుతుందని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడం, జగన్ పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచించి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవడం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండీసీ డైరెక్టర్ పదవికి కడప జిల్లాలోని వేంపల్లెకు చెందిన ఈఎస్ సల్మా బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీఎండీసీ ఛైర్మన్‌కు సమర్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పరాజయానికి చింతిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ ఎంపీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థులకు తొలుత ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.