India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండీసీ డైరెక్టర్ పదవికి కడప జిల్లాలోని వేంపల్లెకు చెందిన ఈఎస్ సల్మా బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీఎండీసీ ఛైర్మన్‌కు సమర్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పరాజయానికి చింతిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ ఎంపీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థులకు తొలుత ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

కూటమికి కంచుకోటగా విశాఖ జిల్లా మారింది. 2014లో విశాఖ జిల్లాలో కూటమి తన సత్తా చూపింది. అనంతరం 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా సాగిన సమయంలో కూడా విశాఖలో 4 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచి తమ సత్తా చాటారు. తాజాగా విశాఖ జిల్లా మొత్తం కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజధానిగా విశాఖను జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా.. ప్రజలు విశ్వసించకుండా కూటమికే జై కొట్టారు.

వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లికి చెందిన సైకం లక్ష్మమ్మ జగన్మోహన్ రెడ్డి ఓటమిని తట్టుకోలేక బుధవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు వైసీపీలో చురుగ్గా పాల్గొనే వారని తెలిపారు.

సాలూరు ఎమ్మెల్యేగా 13,733 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి.. వైసీపీ అభ్యర్థి రాజన్నదొరపై గెలుపొందారు. నియోజకర్గంలో మండలాల వారీగా ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి.
☛ సాలూరు రూరల్‌లో YCPకి 3,155
☛ సాలూరు టౌన్‌లో TDPకి 12,579
☛ పాచిపెంటలో YCPకి 104
☛ మెంటాడలో TDPకి 4,258
☛ మక్కువలో YCPకి 520
☛☛ పోస్టల్ బ్యాలెట్‌లో TDPకి 675 ఓట్ల మెజార్టీ వచ్చింది.

తాడిపత్రి అలర్ల కేసులో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ కోర్టులో హజరు కానున్నారు. ఇప్పటికే పెద్దారెడ్డి 9మంది అనుచరులు ఉదయం సరెండర్ అయ్యారు. వారికి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు గుంతకల్లు కోర్టులో సరెండర్ కానున్నారు.

కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె నాగేంద్ర (40) అనే వ్యక్తిని కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న కొలిమిగుండ్ల పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి హత్యకు గల కారణాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్. బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. పి.లింగాలవలస గ్రామానికి చెందిన పరిగి సుబ్బారావు (45) స్వగ్రామం వస్తుండగా జగన్నాథపురం సమీపంలో ఆటో ఢీకొట్టి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గొంతినె శ్రీనివాసరావు బైక్‌పై వస్తుండగా మరడాం జంక్షన్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం దశాబ్దాల ఆనవాయితీ. తాజా ఎన్నికల్లోనూ అదే నిజమైంది. 1952 నుంచి 2019 వరకు అధికారం చేపట్టిన పార్టీలన్నీ తూ.గో.లో అత్యధిక స్థానాలు దక్కించుకున్నవే. ఇక 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి తూ.గో.లో పోటీ చేయగా.. అప్పుడు 21 స్థానాల్లో ప్రతిపక్షాలకు ఒక్కసీటు దక్కకుండా టీడీపీకే పట్టం కట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు సంబంధించిన ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. ఫలితాలు www.bse.ao.gov.inలో తెలుసు కోవచ్చునని పేర్కొన్నారు. జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ నియమాల ప్రకారం ఎంపికైన విద్యార్థులు వెంటనే బ్యాంకులో విద్యార్థి పేరున సేవింగ్స్ ఖాతా తీసుకుని తండ్రి/తల్లి జాయింట్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.