India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజలు https://Meekosam.ap.gov.inలో లేదా నేరుగా అయినా అర్జీలను సమర్పించవచ్చని అన్నారు.1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమర్పించిన అర్జీల పురోగతిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

✩శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో
✩జలమూరు: మా రెండు గ్రామాలను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
✩ఆమదాలవలస: పుష్కరిణిలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి
✩నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా: ఎమ్మెల్యే అశోక్
✩పలాసలో రక్తదానం చేసిన మాజీ మంత్రి సీదిరి
✩ గొప్పిలిలో వరి కుప్ప దగ్ధం
✩లావేరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
✩ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

నెల్లూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్జీల స్థితిగతులు, తదితర వివరాల కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

విశాఖలో ఆదివారం జరుగుతున్న ఇండియా- శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 60 మంది స్వచ్చంధ సంస్థల బాలబాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించారు. స్వచ్చంధ సంస్థలలో ఉంటున్న 60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సీపీ బాలబాలికలను స్టేడియంలో కలిసి ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ ZPHSలో సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO నారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి. పూర్ణచంద్రరావు ఆదివారం తెలిపారు. ఒక్కో మండలం నుంచి 11 ఉత్తమ ప్రదర్శనలు ఈ మేళాలో కొలువుదీరనున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదిక దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని DMHO డాక్టర్ కె. వెంకటేశ్వర రావు తెలిపారు. మొత్తం 1,89,550 మంది చిన్నారులకు గానూ 1,85,759 మందికి చుక్కలు వేయడం ద్వారా 98 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వివరించారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

గుంటూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. నిర్దేశించిన 2,14,981 మంది చిన్నారులకు గాను 2,08,735 (97.9%) మందికి చుక్కలు వేసినట్లు DMHO విజయలక్ష్మీ తెలిపారు. మురికివాడలు, ప్రమాదకర ప్రాంతాల్లోని 2,434 మందికి, ప్రయాణాల్లో ఉన్న 1,474 మందికి కూడా మందు వేశారు. ఆదివారం కేంద్రాలకు రాని పిల్లల కోసం సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని ఆమె పేర్కొన్నారు.

డ్రగ్స్ వినియోగం కేవలం ఆరోగ్యానికే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పు అని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన ‘రోటోఫెస్ట్-2025’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల కదలికలపై అనుమానం వస్తే వెంటనే 1972 నంబర్‌కు సమాచారం అందించాలని ఐజీ పిలుపునిచ్చారు.

GVMCలో కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చేసిన ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. విప్ ధిక్కరణకు సంబంధించి 26 మంది కార్పొరేటర్లకు నేరుగా నోటీసులు అందినట్లు ఆధారాలు లేవన్నారు. 26 మంది కార్పొరేటర్ల ఫిరాయింపుతో TDP మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నందని వైసీపీ ఏప్రిల్‌లో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది.కాగా 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ విప్ ధిక్కరణ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు.

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎంహెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.
Sorry, no posts matched your criteria.