Andhra Pradesh

News June 6, 2024

ప.గో.: బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

బస్సు ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందినట్లు ఆకివీడు ఎస్సై బత్తిన నాగరాజు బుధవారం తెలిపారు. ఆకివీడు శివారులోని ఉప్పుటేరు వద్ద ఏలూరు నుంచి వస్తున్న బస్సు కైకలూరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న చిప్పల నాగరాజును ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

News June 6, 2024

తాడేపల్లి: లోకేశ్‌ను కలిసిన అచ్చెన్నాయుడు

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా అచ్చెన్నాయుడు కలిశారు. గురువారం తాడేపల్లి (M) ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవటం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

News June 6, 2024

ప.గో.: NOTAకు 34,003 ఓట్లు

image

ఉమ్మడి. ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 34,003 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా పోలవరంలో, అత్యల్పంగా పాలకొల్లులో వచ్చాయి.
☛ పోలవరం -5611 ☛ గోపాలపురం -4500
☛ చింతలపూడి -4121 ☛కొవ్వూరు -2465
☛ నిడదవోలు -2144 ☛ఉంగుటూరు -2105
☛ దెందులూరు -1920 ☛ తణుకు -1722
☛ ఆచంట -1673 ☛ ఉండి -1607
☛ తాడేపల్లిగూడెం -1534 ☛ ఏలూరు -1256
☛ నరసాపురం -1216 ☛ భీమవరం -1210
☛పాలకొల్లు – 919

News June 6, 2024

తాడేపల్లి: చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

తాజా ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్న చంద్రబాబుకు పోలీసులు భద్రతను పెంచారు. తాడేపల్లి (M) ఉండవల్లి గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తూ భద్రతను మరింత పెంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

News June 6, 2024

పవన్‌ కళ్యాణ్‌పై 9 డిగ్రీలు చేసిన వ్యక్తి.. ఓట్లెన్నో తెలుసా..?

image

పిఠాపురంలో పవన్‌పై పోటీగా జైభీమ్ భారత్ పార్టీ తరఫున 9 డిగ్రీలు చేసిన జగ్గారపు మల్లికార్జున రావు MLAగా బరిలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పోటీలో నిలిచిన మల్లికార్జున రావుకు కేవలం 594 ఓట్లు రాగా 6వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

News June 6, 2024

కురిచేడు: రిజర్వాయర్‌లో పసికందు మృతదేహం

image

కురిచేడు మండలం అట్లపల్లి రిజర్వాయర్‌లో పసి కందు మృతదేహం బయటపడింది. బుధవారం సాయంత్రం చెరువు పక్కనే పొలం పనులు చేసుకునే వారు కట్టమీద వెళుతుండగా పసికందు మృతదేహాన్ని గుర్తించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు మహిళలు చెరువు కట్టమీద అనుమానస్పదంగా తిరుగుతూ బిడ్డను వదిలేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్‌ఏపీ రక్షిత నీటి పథకం సిబ్బంది వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చెరువును శుభ్రం చేశారు.

News June 6, 2024

తుగ్గలిలో మరో వజ్రం లభ్యం

image

కర్నూలు జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వజ్రాల వేట కోనసాగుతుంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఇవాళ మరో వజ్రం దొరికింది. పత్తికొండకు చెందిన ఓ వ్యక్తి కి దొరికిన ఈ వజ్రాన్ని రూ.2లక్షల నగదు, 2 తులాల బంగారానికి విక్రయించినట్లు సమాచారం.

News June 6, 2024

వెల్లంపల్లి ఓట్ల కంటే బొండా ఉమాకే ఎక్కువ మెజారిటీ

image

విజయవాడ సెంట్రల్ నుంచి 2019 ఎన్నికల్లో 25 ఓట్లతో ఓడిపోయిన బొండా ఉమా మహేశ్వరరావు తాజా ఎన్నికల్లో భారీ మెజారిటీ(68886)తో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విజయం సాధించిన విజయం తెలిసిందే. వెల్లంపల్లికి వచ్చిన 61148 ఓట్ల కంటే ఉమాకు వచ్చిన మెజారిటీనే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బొండాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

News June 6, 2024

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల రాష్ట్ర సిలబస్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజాంపట్నం గురుకులపాఠశాల కన్వీనర్ వై. నాగమల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. నక్షత్రనగర్, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, వినుకొండ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

News June 6, 2024

ప్రకాశం: కోడలిని చంపిన అత్తకు రెండు జీవిత ఖైదీ శిక్షలు

image

నిజామాబాద్ జిల్లాకి చెందిన బానోతు రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను 2020న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాంసింగ్ తల్లి పద్మావతి కోడలిని నిత్యం కట్నం తేవాలని వేధించేది. తనకు ఎవరూ లేరని కట్నం తేలేనని వాపోయేది. రాధను చంపేసి మరో పెళ్లి చేయొచ్చుని కొడుకుతో పన్నాంగం పన్నింది. 2020 ఏప్రిల్ 20న రాధపై పెట్రోల్ పోసి హత్యచేశారు. బుధవారం పద్మావతికి 2 జీవిత ఖైదీ శిక్ష పడింది. రాంసింగ్ పరారీలో ఉన్నాడు.