India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ సెంట్రల్ నుంచి 2019 ఎన్నికల్లో 25 ఓట్లతో ఓడిపోయిన బొండా ఉమా మహేశ్వరరావు తాజా ఎన్నికల్లో భారీ మెజారిటీ(68886)తో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విజయం సాధించిన విజయం తెలిసిందే. వెల్లంపల్లికి వచ్చిన 61148 ఓట్ల కంటే ఉమాకు వచ్చిన మెజారిటీనే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బొండాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల రాష్ట్ర సిలబస్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజాంపట్నం గురుకులపాఠశాల కన్వీనర్ వై. నాగమల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. నక్షత్రనగర్, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, వినుకొండ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాకి చెందిన బానోతు రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను 2020న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాంసింగ్ తల్లి పద్మావతి కోడలిని నిత్యం కట్నం తేవాలని వేధించేది. తనకు ఎవరూ లేరని కట్నం తేలేనని వాపోయేది. రాధను చంపేసి మరో పెళ్లి చేయొచ్చుని కొడుకుతో పన్నాంగం పన్నింది. 2020 ఏప్రిల్ 20న రాధపై పెట్రోల్ పోసి హత్యచేశారు. బుధవారం పద్మావతికి 2 జీవిత ఖైదీ శిక్ష పడింది. రాంసింగ్ పరారీలో ఉన్నాడు.

వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని చినవంక గ్రామానికి చెందిన మదనాల శంకర్ (32) సౌదీ అరేబియాలో మృతి చెందారు. అతను బుధవారం తెల్లవారుజామున మెదడు పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 4 నెలల క్రితం పని నిమిత్తం ఆతను సౌదీ వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల శంకర్ తల్లి కాంతమ్మ కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఎదిగొచ్చిన కొడుకు చిన్న వయసులోనే చనిపోవడంతో తండ్రి సూర్యనారాయణ కన్నీరు మున్నీరయ్యారు.

ఉత్తరావల్లి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడు 1983లో కోళ్ల లలిత కుమారి తాత అప్పలనాయుడు టీడీపీ తరఫున 30,329 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు అదే అత్యధిక మెజార్టీ. S.కోట నియోజకవర్గ కేంద్రం ఏర్పాటయ్యాక 2009లో TDP తరఫున పోటీ చేసిన కోళ్ల 3,440 ఓట్ల ఆధిక్యత సాధించగా.. 2104లో 28,572 మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నికల్లో 38,790 ఓట్ల మెజార్టీతో గెలిచి.. తన తాత పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

40 ఏళ్లుగా టీడీపీకి అందని సర్వేపల్లి నియోజకవర్గంలో ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగిరింది. నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ..అలుపెరుగకుండా శ్రమించి సోమిరెడ్డి విజయకేతనం ఎగరవేశారు. 2004,2009,2014,2019లో పోటీ చేసినా సొంత మండలం తోటపల్లిగూడూరులో కూడా ఆధిక్యం చాటలేకపోయాడు. అయితే తాజాగా వెలువడిన 2024ఎన్నికల ఫలితాలలో 16,228 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు.

శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేయగా, ఐదుగురు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ➤ సీనియర్లు: అచ్చెన్నాయుడు (6వ సారి), కూన రవికుమార్ (2వ సారి), బగ్గు రమణమూర్తి (2వ సారి), కోండ్రు మురళీ (3వ సారి), బెందాళం అశోక్ (3వ సారి) ➤ తొలిసారి: గౌతు శిరీష, నడకుదిటి ఈశ్వర్, గొండు శంకర్, మామిడి గోవింద్, నిమ్మక జయకృష్ణ ఎన్నికయ్యారు.

విశాఖ ఎంపీగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావలసిందిగా చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. దీంతో గురువారం విశాఖలో ఆయన కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని విమానంలో మంగళగిరి బయలుదేరి వెళ్లారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో రేపు జరిగే NDA కూటమి సమావేశంలో శ్రీభరత్ పాల్గోనున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఎం. నాగరాజుకు కేవలం 172 ఓట్లు వచ్చాయి. ఈయనతో పోలిస్తే నోటాకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ(7387)గా ఉన్నాయి. మరోవైపు, మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థికి 8,637 వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు పోల్ అయ్యాయి.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ స్వత్రంత్ర అభ్యర్థికి అతి తక్కవ ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాటే సుబ్రహ్మణ్యానికి 53 ఓట్లు వచ్చాయి. కాగా జిల్లాలో అత్యధికంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి 1,34,414 ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.