Andhra Pradesh

News June 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల

image

జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాయని డీఈవో దేవరాజు తెలిపారు. ఈ www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులకు మెరిట్ కార్డులు త్వరలో రాష్ట్రం నుంచి జిల్లా కార్యాలయానికి వస్తాయని చెప్పారు. ఉపకార వేతనాలకు అర్హత సాధించిన విద్యార్థులు తమ తల్లి లేక తండ్రితో ఏదైనా జాతీయ బ్యాంకులో జాయింట్ ఖాతా తెరవాలని సూచించారు.

News June 6, 2024

కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 చోట్ల టీడీపీ, రెండు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో జనసేన గెలుపొందాయి. జనసేన నుంచి గెలిచిన మండలి బుద్ధ ప్రసాద్‌కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు కూడా మంత్రి పదవులు రేసులో ఉన్నట్లు టాక్. వీరితో పాటు టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, బొండా ఉమా, తంగిరాల సౌమ్య, తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

News June 6, 2024

తూ.గో.: మంత్రి పదవి ఎవరికి..?

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ MLAలో ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం- పినిపే విశ్వరూప్, తుని- దాడిశెట్టి రాజా మంత్రులుగా పనిచేశారు. మరి ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి 14మంది MLAలుగా గెలిచారు. మరి ఈ సారి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది.. ఎందరికి వస్తుంది..?
– మీ కామెంట్..?

News June 6, 2024

సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

image

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రదాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్ళైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.

News June 6, 2024

కేతిరెడ్డి సొంత వార్డులో బీజేపీదే మెజారిటీ

image

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడీయా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కేతిరెడ్డి 3,734 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 9వ రౌండ్‌కి 11వేల మెజారిటీతో ఉన్న ఆయనకు 12వరౌండ్ నుంచి మెజారిటీ తగ్గుతూ వచ్చింది. 20వ రౌండ్‌కు సత్యకుమార్(BJP) 4,138 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ధర్మవరం ఓటర్లు బీజేపీకి మెుగ్గు చూపాగా..తన సొంతవార్డు 21వ వార్డులో 712 ఓట్లల..బీజేపీకి 419, కేతిరెడ్డికి 269 ఓట్లు పడ్డాయి.

News June 6, 2024

శ్రీకాకుళం: శాసనసభకు ఎవరు ఎన్నోసారంటే..!

image

శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేయగా, ఐదుగురు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ➤ సీనియర్లు: అచ్చెన్నాయుడు (6వ సారి), కూన రవికుమార్ (2వ సారి), బగ్గు రమణమూర్తి (2వ సారి), కోండ్రు మురళి (2వ సారి), బెందాళం అశోక్ (3వ సారి) ➤ తొలిసారి: గౌతు శిరీష, నడకుదిటి ఈశ్వర్, గొండు శంకర్, మామిడి గోవింద్, నిమ్మక జయకృష్ణ ఎన్నికయ్యారు.

News June 6, 2024

నేడు విశాఖ – గుణుపూర్ రైలు రద్దు

image

నౌపాడ- పుండీ- తిలారు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా విశాఖ- గుణుపూర్ రైలు గురువారం రద్దు చేస్తు న్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యరాణి, పూరి, కటక్ మెమో రైళ్లు యథావిధిగా తిరుగుతాయని, ప్రయాణికులు గమనించగలరని పేర్కొన్నారు. ఈ మార్పుకి అనుగుణంగా ప్రయాణికులు ప్రణాళికలు వేసుకోవాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో సూచించారు.

News June 6, 2024

విశాఖ: నేటితో ముగియనున్న ఎన్నికల కోడ్

image

ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నట్లు విశాఖ జిల్లా అధికారులు తెలిపారు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 50 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌‌ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈసారి నోటాకు ఓట్లు భారీగా నమోదయ్యాయి. అముదాల వలస, టెక్కలి, ఇఛ్చాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఎచ్చెర్లలో అత్యధికంగా, ఆముదాల వలసలో అత్యల్పంగా ఓట్లు పడ్డాయి. ఈసారి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో 4,270 ఓట్లు నోటాకు పడటం గమనార్హం. అయితే అత్యల్పంగా ఇఛ్చాపురంలో 744 ఓట్లు పోల్ అయ్యాయి.

News June 6, 2024

నెల్లూరు: 30 ఏళ్ల తర్వాత ఇక్కడ TDP గెలిచింది..!

image

రాష్ట్ర చరిత్రలోనే రికార్డు విజయం సాధించిన టీడీపీ, కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో కూడా వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టింది. 30ఏళ్లుగా వైసీపీ హవా ఇక్కడ కొనసాగినప్పటికీ తాజాగా జరిగిన ఎన్నికలలో టీడీపీ జెండా ఎగరవేసింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రావుపై టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వర రావు 18,558 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.