India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి వి.లక్ష్మీ కనకదుర్గ తెలిపారు. ఈ టోర్నీలో కృష్ణా వర్శిటీ జట్టు ఎంపిక చేసే యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ ఆధ్వర్యంలో జరుగనున్న అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి పంపనున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు.
రాజంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన రేణుక కొత్త బోయనపల్లి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్లపాలెం పంచాయతీలోని 29 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఎంపీడీవో నేతాజీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామన్నారు. అలాంటి తమపై పలువురు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. అందువల్లే రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.
శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని శ్రీశైలం ఆలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 17వ తేదీన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. కళ్యాణోత్సవానికి ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించి గణపతి పూజ, గౌరీ పూజ, మాంగల్య పూజ, సీతారాముల కళ్యాణం ఉంటుందన్నారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. అనుచరులతో సమావేశమై ఇకపై రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో ఉంటానన్నారు. సీవీ శేషారెడ్డి రెండు సార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు.
గుంతకల్ పట్టణంలోని 4, 6, 18, 30వార్డులకు చెందిన, నెలగొండ, నాగసముద్రం, నక్కనదొడ్డి, N. కొట్టాల, N. వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన 200మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గుంతకల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేశారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించడానికి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఉలవపాడు మండలం తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ట్రాక్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకుపచ్చ రంగు చీర ధరించినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ సోమవారం పలాసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా సేవలందించినా గడిచిన కొంతకాలంగా జరిగిన అవమానాలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 25,26, 27, 29 తేదీల్లో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు బుల్లె శివబాల నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.