India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ కలెక్టరేట్లో నిన్న పీజీఆర్ఎస్ ప్రారంభమైన కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కలెక్టరేట్ హాల్ అంధకారంగా మారింది. దీంతో ఫోన్ లైట్ల మధ్యనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారులు తమ సమస్యలు విన్నవించుకున్నారు. సెల్ ఫోన్లు, కొవ్వొత్తుల వెలుగులో జేసీ మయూరి అశోక్ ఆర్డీఓ అర్జీదారులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించారు.

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను (SI) బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో టి.రుక్మాంగందరరావు, యు.రూపవతి, కె.భాస్కర్ రావు సహా తొమ్మిది మందికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని, బదిలీ అయిన అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న ఆయనకు జిల్లాలోని హేమాహేమీలైన నేతలను మేనేజ్ చేయడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. ఎమ్మెల్యేలందర్నీ ఒకతాటిపై తీసుకొచ్చి.. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి అధిక సీట్లను కైవసం చేసుకునేలా చేయడం ఆయనకు అతి పెద్ద టాస్క్. అలాగే అంతర్గత పార్టీ కుమ్ములాటలకు భూపేశ్ ఏ విధంగా పరిష్కారం చూపుతారనేది చూడాలి.

ఆదోని మండలం ఆరేకల్లు మెడికల్ కాలేజీ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై భారీ వాహనాలు వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. మృతుడికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 34878 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23115 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికీ 31872 పెళ్లి టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని డిసెంబర్‌కు 350 మెట్రిక్ టన్నులు రానుందన్నారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈవో సుజాత సోమవారం తెలిపారు. 100,300,500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.