India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాడేపల్లిగూడెం పట్టణంలోని 2టౌన్ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూం వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. యాచకుడు నిద్రపోతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. మృతునికి 60 ఏళ్ల వయసు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల హత్యకు గురైన ఎన్ఎస్ యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పలికి, అధైర్య పడకండి.. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సంపత్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎన్‌ఎస్ యుఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి కూడా ఉన్నారు.

పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్ రావుపై ఆయన అల్లుడు భాష్యం ప్రవీణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. శంకర్ రావు అన్నయ్య కూతురిని భాష్యం ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ అవుతారు. కాగా మామ నంబూరు శంకర్ రావుపై 21,089 ఓట్ల మెజారిటీతో భాష్యం ప్రవీణ్ విజయం సాధించి సత్తా చాటాడు.

తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీషు, సంస్కృతం ఫిజిక్స్, కెమిస్ట్రీ ,జువాలజీ, కామర్స్‌తోపాటు లైబ్రేరీయన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత డిగ్రీ / పీజీ పూర్తయిన అభ్యర్థులు ఈనెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తులు అందించాలన్నారు.

టీడీపీ విజయం సాధించిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. లోకేశ్‌ను శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలు లోకేశ్‌తో చర్చించారు.

రాజీనామాలు చేసిన వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందా, లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాలంటీర్లు దాదాపు అందరూ రాజీనామా చేశారు. టీడీపీ వచ్చాక రూ.పదివేలు వేతనం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రూ.5 వేలతో బాధ్యతగా పనిచేస్తూనే రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా లేక టీడీపీ నేతలు సిఫారసు మేరకు కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి.

మాచవరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మాచవరం ఎస్సై అమిరుద్దీన్ బుధవారం తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని పిన్నెల్లి, కొత్త గణేషన్‌పాడు గ్రామాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు.

రేపు, ఎల్లుండి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈ మేరకు APSDMA తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

కుటుంబ సమస్యలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మదనపల్లె మండలంలో జరిగిందని సీఐ శేఖర్ తెలిపారు. కోటవారిపల్లె తండాకు చెందిన చిన్నరెడ్డప్పనాయక్ కుమారుడు కృష్ణానాయక్(35) ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. భార్య అమ్రూ కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిచూడగా భర్త చనిపోవడంతో బోరున విలపించింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రైల్వే అధికారులు ఘనంగా నిర్వహించారు. డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పర్యావరణ ప్రాధాన్యత తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్లో ప్రయాణికులకు చేతి సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం జరిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మంజు శ్రీ ప్రసాద్ నేతృత్వంలో మొక్కలు నాటారు.
Sorry, no posts matched your criteria.